వారంలోని ఈ రోజులో అయ్యప్పను పూజించడం వలన కలిగే ఫలితాలు ఇవే..!

హిందూ మతంలో కొన్ని రోజులు దేవుళ్లకు అంకితం చేయబడ్డాయి.మంగళవారం ఆంజనేయుడు, గురువారం సాయిబాబా, శుక్రవారం అమ్మవారు, శనివారం వెంకటేశ్వర స్వామి ఇలా ఒక్కో దేవుడికి ఒక్కొక్క రోజు విశిష్టమైనదిగా హిందువులు భావిస్తారు.

 These Are The Results Of Worshiping Ayyappa On This Day Of The Week, Ayyappa Swa-TeluguStop.com

ఆ రోజు దేవుడికి పూజలు చేస్తూ ఉంటారు.కానీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారుమ్రోగుతున్న స్వామియే శరణం అయ్యప్ప స్వామిని ఏ రోజున విశేషంగా పూజించాలి.

పూజిస్తే ఎలాంటి ఫలితాలు ఏమిటో, అలాగే ఎలా పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం.దేవుడు ఒక్కడైనా ఒక్కో లోక కళ్యాణం కోసం ఒక్క రూపంలో అవతరించి పూజలు అందుకుంటారు.

అలాగే అయ్యప్ప స్వామి కూడా చిన్ముద్ర రూపంలో శబరిగి కొండపై చిన్ముద్రా రూపాన్ని అధిష్టించి పూజలు అందుకుంటున్నాడు.

Telugu Ayyappa, Ayyappa Swamy, Devotional, Lord Shiva, Mohini Avataram, Sabarima

అయితే అయ్యప్ప స్వామికి బుధవారం( wednesday ) అంటే చాలా ఇష్టమట.అందుకే ఆ రోజున స్వామిని విశేషంగా పూజిస్తారు.అలాగే ఆ రోజున హరిహరసుతుడు అయ్యప్ప స్వామిని పూజించడం వలన చాలా ఫలితాలను పొందవచ్చని పండితులు చెబుతున్నారు.

అలాగే కుటుంబం కష్టాల్లో ఉంటే తప్పనిసరిగా అయ్యప్ప స్వామిని పూజించాలి.అలాగే ఐదుగురు అయ్యప్పలను ఇంటికి పిలిచి బిక్ష పెట్టాలి.ముందుగా మన స్థోమతకు తగ్గట్టుగా అయ్యప్పను ఆవాహనం చేసి, షోడసోపచార విధంగా పూజలు చేయాలి.అలాగే పంచామృతంతో అభిషేకం లాంటి పూజలు చేయాలి.

అలాగే వినాయకుడు వల్లి దేవా సమేత శుభమణ్యేశ్వరుడిని కూడా ఆవాహన చేసి పూజలు చేయాలి.అంతేకాకుండా దీర్ఘ సమస్యలతో బాధపడేవారు, కోర్టు సమస్యల పరిష్కారం కాకుండా ఇబ్బంది పడే వారు కూడా స్వామిని పూజించడం వలన కోరికలు తీరుతాయని భక్తులు నమ్ముతారు.

Telugu Ayyappa, Ayyappa Swamy, Devotional, Lord Shiva, Mohini Avataram, Sabarima

ఇంకా చెప్పాలంటే బుధవారం వినాయకుడితో పాటు అయ్యప్ప స్వామికి కూడా ఎంతో ఇష్టమైన రోజు.అయ్యప్ప స్వామి అంటే విష్ణువు( Lord shiva ), అప్ప అనగా శివుడు అని అర్థం.వీరిద్దరి కలయిక వల్ల జన్మించినందున ఈ స్వామి వారిని అయ్యప్ప అని పిలుస్తారు.ఇక రాక్షసులు, దేవతలు క్షీరసాగర మధనం చేస్తున్న సమయంలో అమృతాన్ని పంచడానికి సాక్షాత్తు శ్రీ విష్ణు భగవానుడు మోహిని అవతారంలో వస్తాడు.

మోహిని అవతారంలో ఉన్న విష్ణువుకి, శివునికి పుట్టిన బిడ్డగా అయ్యప్పను భావిస్తారు.దక్షిణ భారత దేశంలో అయ్యప్ప స్వామిని ఎక్కువగా పూజిస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube