మన భారతదేశంలో ఉన్న చాలామంది ప్రజలు ఆచారాలను సంప్రదాయాలను కచ్చితంగా పాటిస్తూ ఉంటారు.ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి నెలలో వచ్చే ఏకాదశి తిధినీ ప్రజలు ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు.
అలాగే నెలలో రెండు సార్లు వచ్చే ఏకాదశి రోజు మాత్రం ప్రత్యేకమైన పూజలు చేసి ఉపవాసం కూడా ఉంటారు.అసలు ఏకాదశి రోజున ఏ ఆహార పదార్థాలు తినాలి? ఏ ఆహార పదార్థాలు తినకూడదు అనే విషయంపై చాలామందికి సందేహాలు ఉంటాయి.అలాంటి ఈ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే ఏకాదశి రోజున ఫలాలు తినడం మంచిదని పండితులు చెబుతున్నారు.
మామిడి,( Mango ) ద్రాక్ష, అరటి పండ్లు వంటివి తినవచ్చు.కానీ కూరగాయలు మాత్రం తినకూడదు.అయితే అలాగే జలహరి అంటే జలాన్ని ఆహారంగా తీసుకోవడం.ఆకలి వేసినప్పుడు నీళ్లు తాగుతూ కటిక ఉపవాసం చేసేవారు కూడా ఉంటారు.ఏకాదశి రోజు ఈ జలహారి ఉపవాసాన్ని చాలామంది ప్రజలు పాటిస్తారు.అంతేకాకుండా క్షీరం అంటే ఉపవాసం ఉన్న సమయంలో పాలు త్రాగవచ్చు.
పాల ఉత్పత్తి అయిన మజ్జిగ కూడా సేవించవచ్చు.అలాగే నత్తబోజి అంటే సిరి ధాన్యాలు,తృణధాన్యాలు, బియ్యం, కూరగాయలు లేకుండా వండిన భోజనం అని అర్థం.
ఇలాంటి భోజనాన్ని ఒక పూట తీసుకొని మిగతా సమయాలలో ఉపవాసం ఉంటారు.
సాబుదాన, మఖాన, ఆలుగడ్డలు,( Potatoes ) పల్లీలను ఈ నక్తభోజిలో తినవచ్చు.ముఖ్యంగా చెప్పాలంటే అన్నం, మాంసం, ఉల్లిపాయ( Onion ), వెల్లుల్లి, పప్పు దినుసులు వంటివి అస్సలు తినకూడదు.అయితే ఒక చిన్న ముక్క నోట్లోకి వెళ్లిన ఆ రోజు చేసే ఉపవాసానికి ఫలితం ఉండదు.
టీ, కాఫీలకు కూడా దూరంగా ఉండాలని పండితులు చెబుతున్నారు. ఏకాదశి కోసం ప్రసాదం తయారు చేస్తున్నట్లయితే ఆ ప్రసాదాన్ని ఆవు నెయ్యితో తయారు చేయడం మంచిది.
పల్లి నూనెతో కానీ, మరే రిఫైన్డ్ నూనెతో కానీ ప్రసాదాన్ని తయారు చేయకూడదు.ఈ విషయాలను కచ్చితంగా పాటిస్తే ఏకాదశి ఉపవాసానికి అర్థం ఉంటుంది.
DEVOTIONAL