ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని దేవరియాలో( Deoria ) విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది.ఇద్దరు వివాహిత మహిళలు స్థానిక ఆలయంలో మంగళవారం వివాహం చేసుకోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన ఈ ఇద్దరు మహిళలు వారి జీవితంలో ఎదురైన సమస్యల గురించి ఒకరితో ఒకరు పంచుకుంటూ, ఆప్యాయతను పెంపొందించుకున్నారు.వివరాల ప్రకారం, ఈ ఇద్దరు మహిళలు( Two women ) తమ భర్తల నుంచి హింసకు గురవుతున్నట్లు తెలుసుకొని, సమస్యలను ఒకరితో ఒకరు పంచుకున్నారు.
ఆరు సంవత్సరాలుగా స్నేహితులుగా ఉన్న వీరు తర్వాత ఒకరినొకరు ఇష్టపడి కలిసి జీవితాన్ని ప్రారంభించాలనే నిర్ణయానికి వచ్చారు.దాంతో తాజాగా దేవరియాలోని ఒక ఆలయంలో సంప్రదాయ పద్ధతుల్లో వీరిద్దరు వివాహం చేసుకున్నారు.మంగళసూత్రంతో పాటు సింధూరాన్ని కూడా అందరి ముందే ధరించి పెళ్లిని పూర్తి చేశారు.ఈ సంఘటన దేవరియాలో తీవ్ర చర్చకు దారి తీసింది.
సమాజం వీరి నిర్ణయాన్ని ఎలా స్వీకరిస్తుందనేది ప్రశ్నగా ఉండగా, తమ నిర్ణయంపై వారు పూర్తి నమ్మకంతో ఉన్నట్లు వెల్లడించారు.ఆధునిక సమాజంలో ఇలాంటి సంఘటనలు ప్రేమ, ఆత్మీయతకు సంబంధించిన సంప్రదాయాలకు కొత్త అర్థాన్ని జోడిస్తున్నట్లు భావించవచ్చు.ఈ వివాహం ఇన్‌స్టాగ్రామ్ పరిచయాలు ఎంతగా జీవితాలను మార్చగలవో మరోసారి నిరూపించింది.ఇది సమాజానికి కొత్త చర్చనీయాంశాన్ని అందించింది.ఇలాంటి విచిత్ర ఘటనలు ముందు ముందు ఎన్ని చూడాలో మరి.ఈ విషయాన్ని తెలుసుకున్న సోషల్ మీడియా వినియోగదారులు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.ఇంతవరకు పెళ్లి చేసుకొని ఇద్దరు అబ్బాయిలు లేదా, ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకోవడం చూశాం కానీ.ఇలా వివాహం జరిగినవారు అందులోనూ మహిళలు పెళ్లి చేసుకోవడం చూడడం ఇదే మొదటి సారి అంటూ కామెంట్ చేస్తున్నారు.
మరికొందరేమో ఇలాంటి వారి వల్ల సమాజం పాడవుతుందంటూ కాస్త ఘాటుగా స్పందిస్తున్నారు.