సాధారణంగా కొందరికి బాడీ మొత్తం సన్నగానే ఉంటుంది.కానీ, పొట్ట వద్ద మాత్రం కొవ్వు పేరుకుపోయి లావుగా కనిపిస్తుంటుంది.
దీని వల్ల బట్టలు పట్టకపోవడమే కాదు శరీర ఆకృతి సైతం అందవిహీనంగా కనిపిస్తుంది.అందుకే బాన బొట్టను నాజూగ్గా మార్చుకోవడం కోసం విశ్వప్రయత్నాలు చేస్తుంటారు.
మీరు ఈ లిస్ట్ లో ఉన్నారా.? అయితే డోంట్ వర్రీ.ఎందుకంటే, ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ పొడిని పాలల్లో కలిపి రోజు తీసుకుంటే పొట్ట ఎంత లావుగా ఉన్నా సన్నగా మారుతుంది.అదే సమయంలో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కూడా లభిస్తాయి.
మరి ఇంకెందుకు లేటు ఆ పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి.
ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో ఒకటిన్నర టేబుల్ స్పూన్ సోంపు గింజలు, వన్ టేబుల్ స్పూన్ వాము, అంగుళం దాల్చిన చెక్క, వన్ టేబుల్ స్పూన్ మిరియాలు, ఐదు యాలకులు వేసి వేయించుకోవాలి.
ఇలా వేయించుకున్న పదార్థాలను చల్లారనిచ్చి.అప్పుడు మిక్సీ జార్ లో వేసుకోవాలి.
అలాగే అందులో వన్ టేబుల్ స్పూన్ ఆర్గానిక్ పసుపు, వన్ టేబుల్ స్పూన్ అశ్వగంధ పొడి, మూడు టేబుల్ స్పూన్ల హోం మేడ్ బాదం పొడి, వన్ టేబుల్ స్పూన్ అల్లం పొడి, రెండు చిన్న పటిక బెల్లం ముక్కలు వేసుకుని మెత్తటి పొడిలా గ్రైండ్ చేసుకోవాలి.ఈ పొడిని గాలి చొరబడని డబ్బాలో నింపుకుని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు.
ఈ పొడిని వన్ టేబుల్ స్పూన్ చప్పున ఒక గ్లాస్ ఫ్యాట్ లెస్ పాలల్లో కలిపి.ఐదారు నిమిషాల పాటు మరిగించి తాగేయడమే.ప్రతి రోజు ఈ పొడిని పాలల్లో కలిపి తీసుకుంటే పొట్ట కొవ్వు క్రమంగా తగ్గిపోతుంది.కీళ్ల నొప్పులు ఉంటే.వాటి నుంచి విముక్తి లభిస్తుంది.నిద్రలేమి దూరం అవుతుంది.
ఎముకలు, కండరాలు దృఢంగా మారతాయి.జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధులు దరి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.
మరియు ఇమ్యూనిటీ సిస్టమ్ సైతం బూస్ట్ అవుతుంది.