సినీనటి సమంత( Samantha ) వ్యక్తిగత జీవితం అలాగే సినీ జీవితం గురించి అందరికీ తెలిసిందే.ఇలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఒక మద్దతు కుటుంబంలో జన్మించిన సమంత నేడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఓవెలుగు వెలుగుతున్నారు.
ప్రస్తుతం సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా గడుపుతున్నారు.ఇక సమంత వ్యక్తిగత జీవితం కూడా అందరికీ తెలిసిన విషయమే.
ఈమె సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా కొనసాగుతూ నటుడు నాగచైతన్య ( Nagachaitanya ) ప్రేమలో పడ్డారు.

ఇలా ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.పెళ్లి తర్వాత కూడా ఎంత సంతోషంగా ఉంటూ ఎందరికో ఆదర్శంగా నిలిచిన ఈ జంట ఊహించని విధంగా విడాకులు తీసుకొని విడిపోయారు.ఇక సమంత నుంచి విడిపోయిన నాగచైతన్య తిరిగి శోభిత( Sobhita ) ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత మాత్రం ఇప్పటికే సింగిల్ గానే ఉన్నారు.
ఈ విధంగా సమంత నాగచైతన్య ఎందుకు విడిపోయారో స్పష్టంగా తెలియదు కానీ వీరు విడాకులకు సంబంధించి ఎన్నో రకాల వార్తలు బయటకు వచ్చాయి.

ఇదిలా ఉండగా సమంత తాజాగా సిడ్నీలోని( Sydney ) ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.నాకు ఎవరైనా నువ్వు ఇలాగే ఉండాలి ఇదే పనే చేయాలి, ఇట్లే నడుచుకోవాలి అని రూల్స్ చెబితే మాత్రం అసలు నచ్చదని తెలిపారు.
నాకు నచ్చిన విధంగా బ్రతకడం నాకు ఇష్టం నాకు నచ్చిన పాత్రలను ఎంపిక చేసుకొని సినిమాలలో నటించడం ఇష్టం అంటూ మాట్లాడారు.ఇలా సమంత ఈ వ్యాఖ్యలు చేయడంతో అక్కినేని కుటుంబం, నాగచైతన్య ఈమెకు నిబంధనలు పెట్టడం వల్లే అక్కడ ఇమడలేక పోయారా అంటూ కామెంట్లు చేస్తున్నారు.