చైల్డ్ ఆర్టిస్టులుగా ఉన్నప్పటి నుంచే ఫ్యాన్ బేస్ ఉన్న నటీనటులు ఎవరో తెలుసా?

ప్రస్తుతం హీరోలు, హీరోయిన్లుగా కొనసాగుతున్న చాలా మంది.బాల నటులుగానే సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టారు.

 Tollywood Child Artists And Their Fan Base, Tollywood Child Aritsts, Fan Base, B-TeluguStop.com

ప్రస్తుతం సినిమాల ద్వారా మంచి గుర్తింపు పొందారు.అయితే వీరిందరికీ బాల నటులుగానే మంచి గుర్తింపు ఉంది.ఇంతకీ చైల్డ్ ఆర్టిస్టులుగా ఉన్నప్పటి నుంచే ఫ్యాన్ బేస్ ఉన్న నటీనటులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

బేబి షామిలి

Telugu Akhil Akkineni, Baby Shalini, Baby Shamilli, Baladitya, Fan, Mahesh Babu,

చైల్డ్ ఆర్టిస్టుగా గుర్తింపు పొందిన హీరోయిన్లలో ఒకరు బేబీ షామిలి.బాల నటిగా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ సినిమాల్లో నటించింది.ఆమె నటించిన సినిమాలన్నింటిలో ఉత్తమమైనది అంజలి.

ఈ సినిమాకు గాను 1990లో నేషనల్ ఫిల్మ్ అవార్డు వచ్చింది.అనంతరం హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించింది.2009లో వచ్చిన ఓయ్ ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది.

బేబీ షాలిని

Telugu Akhil Akkineni, Baby Shalini, Baby Shamilli, Baladitya, Fan, Mahesh Babu,

బేబీ షాలినీ అలియాస్ షాలినీ అజిత్ కుమార్. బాల నటిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.3 ఏండ్ల వయసులోనే మలయాళం సినిమా ఎంటె మమట్టిక్కుట్టియమ్మక్కుతో వెండి తెరకు పరిచయం అయ్యింది.జగదేకవీరుడు అతిలోకసుందరి మూవీలో తన చెల్లెలు షామిలితో కలసి చిరంజీవి చేరదీసే అనాథ అమ్మాయి పాత్రలో నటించింది.చాలా ఏండ్ల తర్వాత తను హీరోయిన్ గా పరిచయం అయ్యింది.

ఆమె నటించిన తొలి మూవీ అనియతి ప్రవు అతి పెద్దహిట్ అయ్యింది.ఆమె నటించిన పలు సినిమాలు భారీ హిట్లుగా నిలిచాయి.2000లో షాలినీ తమిళ నటుడు అజిత్ కుమార్ ను పెళ్లి చేసుకుంది.

తరుణ్

Telugu Akhil Akkineni, Baby Shalini, Baby Shamilli, Baladitya, Fan, Mahesh Babu,

తెలుగులో హీరోగా మంచి గుర్తింపు పొందిన తరుణ్ బాల నటుడిగానే సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు.ప్రముఖ నటటి రోజారమణి కుమారుడిగా తను సినిమాల్లో ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు పొందాడు.నువ్వే కావాలి, నువ్వు లేక నేను లేను, నువ్వే నువ్వే, నవ వసంతం, శశిరేఖా పరిణయం లాంటి హిట్ సినిమాల్లో నటించాడు.

ఆర్తి అగర్వాల్, ప్రియమణితో పెళ్లి అంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి.డ్రగ్స్ కేసులో తన పేరు బాగా వినిపించింది.

బాలదిత్య

Telugu Akhil Akkineni, Baby Shalini, Baby Shamilli, Baladitya, Fan, Mahesh Babu,

బాలాదిత్య సైతం బాల నటుడిగానే సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు.నటుడిగా, యాంకర్ గా, డబ్బింగ్ ఆర్టిస్టుగా మంచి పేరు పొందాడు.రాజేంద్రప్రసాద్ హీరోగా వచ్చిన ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం అనే కామెడీ మూవీతో బాలాదిత్య బాల నటుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించాడు.బాల నటుడిగా 40 సినిమాల్లో నటించిన ఆయన.హీరోగా 10 సినిమాల్లో యాక్ట్ చేశాడు.హీరోగా తన తొలి మూవీ చంటిగాడు.జాతీయ పురస్కారాన్ని అందుకున్న 1940 లో ఒక గ్రామం అనే సినిమాలో బాలాదిత్య కీలక పాత్ర పోషించాడు.

మహేష్ బాబు

Telugu Akhil Akkineni, Baby Shalini, Baby Shamilli, Baladitya, Fan, Mahesh Babu,

ప్రముఖ తెలుగు నటుడు ఘట్టమనేని కృష్ణ నట వారసుడిగా తెలుగు సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు మహేష్ బాబు.బాల నటుడిగా 8 సినిమాలు చేశాడు.హీరోగా 25 సినిమాల్లో నటించాడు.

హీరోగా తొలి మూవీ రాజకుమారుడుతోనే నంది అవార్డును అందుకున్నాడు.ఆ తర్వాత పలు విజయవంతమైన సినిమాల్లో నటించాడు.పలు సార్లు ఉత్తమ నటుడిగా నందులు అందుకున్నాడు.

మాస్టర్ భరత్

Telugu Akhil Akkineni, Baby Shalini, Baby Shamilli, Baladitya, Fan, Mahesh Babu,

1995 ఏప్రిల్ 9న జన్మించిన భరత్.బాల నటుడిగా మంచి గుర్తింపు పొందాడు.తెలుగు, తమిళంలో పలు సినిమాలు చేశాడు.

భరత్ 2002లో నైనా సినిమా ద్వారా వెండి తెరకు పరిచయం అయ్యాడు.ఇప్పటి వరకు తను 62 సినిమాల్లో నటించాడు.రెడీ, బిందాస్, నిప్పు సినిమాల్లో నటనకు గాను ఉత్తమ బాల నటుడిగా నంది అవార్డులు అందుకున్నాడు.

అఖిల్

Telugu Akhil Akkineni, Baby Shalini, Baby Shamilli, Baladitya, Fan, Mahesh Babu,

అక్కినేని నాగార్జున నట వారసుడిగా సినిమాల్లోకి అడుగు పెట్టాడు అఖిల్.ఏప్రిల్ 8, 1994న కాలిఫోర్నియాలో జన్మించాడు అఖిల్.నాగార్జున, రెండవ భార్య అయిన అమలకు తను జన్మించాడు.

ఆయన వయసు సంవత్సరం ఉండగానే సిసీంద్రి సినిమా ద్వారా తెలుగు జనాలకు పరిచయం అయ్యాడు.అఖిల్ 1995లో వచ్చిన శివనాగేశ్వర రావు మూవీ సిసింద్రీలో ప్రధాన పాత్ర పోషించాడు.

ఆ తర్వాత అఖిల్ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube