ఐఐటీ కాన్పూర్( IIT Kanpur ) క్యాంపస్‌లో అద్భుతం జరిగింది.వీధి కుక్కలకు,( Stray Dogs ) రోబో కుక్కకు( Robot Dog ) మధ్య ఓ రేర్ ఫైట్ సీన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.“ఐఐటీ కాన్పూర్‌లో రోబో డాగ్‌తో వీధి కుక్కల ఆటలు” అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.టెక్నాలజీ, నేచర్ కలిస్తే ఎలా ఉంటుందో ఈ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది.
క్యూరియాసిటీ, కన్ఫ్యూజన్, ఎక్సైట్‌మెంట్.అన్నీ ఒకేసారి కలుగుతాయి అనడంలో సందేహం లేదు.
ఐఐటీ కాన్పూర్ క్యాంపస్‌లో ఎవరో ఈ వీడియో తీశారు.నాలుగు కాళ్ల రోబో అదిరిపోయే వాకింగ్ స్టైల్‌తో క్యాంపస్‌లో చక్కర్లు కొడుతోంది.ఇంతలో ముగ్గురు వీధి కుక్కలు దాన్ని చూశాయి.“ఇదేంటి కొత్తగా ఉంది” అన్నట్టుగా ఆ రోబో చుట్టూ తిరగడం మొదలుపెట్టాయి.కుక్కలాగే నడుస్తుంది కానీ వాసన లేదు, బిహేవియర్ లేదు.అసలు ఇది ఏంటో వాటికి అర్థం కాలేదు.బెదిరింపుగా మొరుగుతూ, కాస్త భయపడుతూ వెనక్కి తగ్గుతూ, అసలు ఇది డేంజరా? లేక హాని చేయని మెషినా? అని కన్ఫ్యూజ్ అయ్యాయి పాపం.
బ్యాక్‌గ్రౌండ్‌లో స్టూడెంట్స్, ప్రొఫెసర్లు ఈ సీన్ చూసి నవ్వుకుంటున్నారు.మరో కుక్క అయితే గుంపు వెనకాల దాక్కుని భయంతో చూస్తోంది.కానీ రోబో మాత్రం వాటి అగ్రెషన్‌ను ఏమాత్రం పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోయింది.
ఈ వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అయిపోయింది.“కుక్కలు భయపడిపోయాయి” అని ఒక యూజర్ కామెంట్ చేస్తే, “ఇది చాలా అమేజింగ్” అని ఇంకొకరు రిప్లై ఇచ్చారు.రోబో నడుస్తున్న విధానం చూసి చాలామంది ఫిదా అయిపోయారు.కుక్కల రియాక్షన్‌ను చూసి కొందరు నవ్వుకున్నారు.
ఈ వైరల్ వీడియో రోబోటిక్స్ టెక్నాలజీ ఎంతలా డెవలప్ అయిందో చూపిస్తోంది.అంతేకాదు, జంతువులకు కూడా ఎంత క్యూరియాసిటీ ఉంటుందో తెలుస్తోంది.
సృష్టిలో జీవం లేని వాటికి, ఉన్న వాటికి మధ్య తేడాను కనిపెట్టలేక అవి ఎలా కన్ఫ్యూజ్ అవుతాయో ఈ వీడియోలో చూడొచ్చు.టెక్నాలజీ, నేచర్ కలిస్తే ఎలా ఉంటుందో ఈ వీడియో మరోసారి ప్రూవ్ చేసింది.
అందుకే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.