సాధారణంగా చాలా మంది ఆడవారు డెలివరీ ( Delivery )తర్వాత ఎదుర్కొనే సమస్యల్లో హెయిర్ ఫాల్ ( Hair fall )అనేది ముందు వరుసలో ఉంటుంది.కంటి నిండా నిద్ర లేకపోవడం, ఒత్తిడి, పోషకాల కొరత, పలు రకాల మందుల వాడకం ఇందుకు ప్రధాన కారణం కావచ్చు.
ఏదేమైనా జుట్టు అధికంగా రాలిపోవడం వల్ల మరింత ఒత్తిడికి లోనవుతుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే ఆయిల్ మీకు చాలా ఉత్తమంగా సహాయపడుతుంది.ఈ ఆయిల్ ను వాడటం అలవాటు చేసుకుంటే హెయిర్ ఫాల్ సమస్యకు సులభంగా గుడ్ బై చెప్పవచ్చు.

ఆయిల్ తయారీ కోసం ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో ఐదు నుంచి ఆరు బాదం గింజలు( Almonds ), వన్ టేబుల్ స్పూన్ మెంతులు( fenugreek ), వన్ టేబుల్ స్పూన్ నువ్వులు, వన్ టేబుల్ స్పూన్ లవంగాలు( cloves ) వేసి కొంచెం బరకగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాసు కొబ్బరి నూనె పోసుకోవాలి.అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న పదార్థాలతో పాటు నాలుగు మందారం పువ్వులు, నాలుగు మందారం ఆకులను కూడా వేసి దాదాపు 15 నిమిషాల పాటు చిన్న మంటపై ఉడికించాలి.దాంతో ఆల్మోస్ట్ మన ఆయిల్ అనేది రెడీ అవుతుంది.
స్టవ్ ఆఫ్ చేసుకుని ఆయిల్ ను చల్లారబెట్టుకోవాలి.పూర్తిగా కూల్ అయ్యాక క్లాత్ సహాయంతో ఆయిల్ ను ఫిల్టర్ చేసుకుని బాటిల్ లో స్టోర్ చేసుకోవాలి.
వారానికి కనీసం రెండుసార్లు ఈ ఆయిల్ ను ఉపయోగించాలి.ఆయిల్ ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి మంచిగా మసాజ్ చేసుకోవాలి.
ఆయిల్ అప్లై చేసుకున్న నాలుగు గంటల అనంతరం లేదా మరుసటి రోజు హెయిర్ వాష్ చేసుకోవచ్చు.

ఈ ఆయిల్ జుట్టును మూలాల నుంచి బలోపేతం చేస్తుంది.జుట్టు రాలడాన్ని ఆపుతుంది.అలాగే ఈ ఆయిల్ జుట్టుకు చక్కని పోషణ అందిస్తుంది.
ఊడిన జుట్టును మళ్ళీ మొలిపిస్తుంది.కాబట్టి హెయిర్ ఫాల్ సమస్యతో సతమతం అవుతున్నవారు కచ్చితంగా ఇప్పుడు చెప్పుకున్న ఆయిల్ ను తయారు చేసుకుని వాడేందుకు ప్రయత్నించండి.
మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.







