ముఖ చర్మాన్ని తెల్లగా మెరిపించే ఎఫెక్టివ్ సీరం ఇది.. ఇంట్లోనే తయారు చేసుకోండిలా!

ప్రస్తుతం మార్కెట్ లో ఎన్నో రకాల స్కిన్ వైట్నింగ్ సీరంలు( Skin Whitening Serum ) మనకు అందుబాటులో ఉన్నాయి.వాటి వల్ల ఎంత ప్ర‌యోజ‌నం ఉంటుంది అన్నది పక్కన పెట్టేస్తే.

 This Is An Effective Serum That Brightens The Skin Details, Skin Whitening Serum-TeluguStop.com

ఇప్పుడు చెప్పబోయే న్యాచురల్ సీరం మాత్రం మీ ముఖ చర్మాన్ని తెల్లగా మెరిపించడంలో చాలా ఎఫెక్టివ్ గా పని చేస్తుంది.అదే సమయంలో అనేక బ్యూటీ బెనిఫిట్స్ ను అందిస్తుంది.

మరి ఇంతకీ ఆ సీరంను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ప‌దండి.

ముందుగా ఒక చిన్న బీట్ రూట్ ను( Beet Root ) తీసుకుని పీల్ తొలగించి వాటర్ తో శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఈ ముక్కలను మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో బీట్ రూట్ జ్యూస్ మరియు కొన్ని గులాబీ రేకులు( Rose Petals ) వేసి ఒకటి లేదా రెండు నిమిషాల పాటు ఉడికించండి.

ఆపై స్టవ్ ఆఫ్ చేసుకుని బీట్ రూట్ జ్యూస్ ను ఫిల్టర్ చేసి చల్లారబెట్టుకోవాలి.

Telugu Aloevera Gel, Tips, Beet Root, Skin, Face Serum, Glycerine, Serum, Latest

ఇప్పుడు ఈ జ్యూస్ లో వన్ టీ స్పూన్ గ్లిజరిన్,( Glycerine ) రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్,( Aloevera Gel ) వన్ టీ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్, వన్ టీ స్పూన్ రోజ్ వాటర్ వేసి బాగా మిక్స్ చేస్తే మన సీరం అనేది సిద్ధమవుతుంది.ఒక బాటిల్ లో ఈ సీరంను నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.ప్రతిరోజు నైట్ నిద్రించే ముందు ముఖానికి తయారు చేసుకున్న సీరంను అప్లై చేసుకుని పడుకోవాలి.

Telugu Aloevera Gel, Tips, Beet Root, Skin, Face Serum, Glycerine, Serum, Latest

ఈ సీరం స్కిన్ కలర్ ను ఇంప్రూవ్ చేయడంలో చాలా బాగా తోడ్పడుతుంది.రెగ్యులర్ గా ఈ సీరంను వాడటం వల్ల మీ స్కిన్ సూపర్ వైట్ గా మరియు బ్రైట్ గా మారుతుంది.అలాగే ఈ సీరం పిగ్మెంటేషన్ సమస్యను దూరం చేస్తుంది.పొడి చర్మాన్ని రిపేర్ చేస్తుంది.స్కిన్ ను ఎల్లప్పుడు హైడ్రేట్ గా ఉంచుతుంది.ప్రస్తుత చలికాలంలో డ్రై స్కిన్ తో బాధపడుతున్న వారికి కూడా ఈ హోం మేడ్ సీరం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

కాబట్టి తప్పకుండా ప్రయత్నించండి.అందంగా మెరిసిపోండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube