వయసు పెరిగిన యవ్వనంగా కనిపించాలనే కోరిక ఎవరికి ఉండదు చెప్పండి.స్త్రీలే కాదు పురుషులు కూడా అదే కోరుకుంటారు.
వయసును ఎలాగో ఆపలేము.కానీ యవ్వనంగా కనిపించడం, కనిపించకపోవడం అనేది మన చేతుల్లోనే ఉంది.
సరైన జాగ్రత్తలు తీసుకుంటే వృద్ధాప్య ఛాయలను దరిదాపుల్లోకి రాకుండా అడ్డుకోవచ్చు.
ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ టోనర్ ను ఉపయోగించారంటే వయసు పెరిగినా.
యవ్వనంగా మెరిసి పోవడం ఖాయం.మరి ఇంతకీ ఆ టోనర్ ను ఎలా తయారు చేసుకోవాలి అన్నది ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ ను పొయ్యాలి.వాటర్ హిట్ అవ్వగానే అందులో రెండు టేబుల్ స్పూన్ల గ్రీన్ టీ పౌడర్ వేసి పది నుంచి పదిహేను నిమిషాల పాటు మరిగించాలి.
ఆ తర్వాత స్ట్రైనర్ సహాయం తో గ్రీన్ టీని ఫిల్టర్ చేసుకుని చల్లార బెట్టుకోవాలి.కంప్లీట్ గా కూల్ అయిన అనంతరం ఆ గ్రీన్ టీ లో హాఫ్ టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్, నాలుగు చుక్కలు టీట్రీ ఎసెన్షియల్ ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటే టోనర్ సిద్ధమయినట్టే.
ఈ టోనర్ ను ఒక బాటిల్ లో నింపుకుని ముఖానికి ఒకటికి రెండు సార్లు స్ప్రే చేసుకోవాలి.

ఇరవై నిమిషాల అనంతరం నార్మల్ వాటర్ తో ముఖాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకుని ఏదైనా మాయిశ్చరైజర్‌ను రాసుకోవాలి.ఈ హోమ్ మేడ్ టోనర్ ను రెగ్యులర్ గా యూస్ చేశారంటే. ముడతలు, సన్నని గీతలు, చారలు, చర్మం సాగడం వంటి వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా ఉంటాయి.
దాంతో వయసు పెరిగినా.ముఖం యవ్వనంగా మరియు కాంతివంతంగా మెరుస్తుంది.