కెనడాలో(Canada) త్వరలో ఫెడరల్ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.నిన్నగాక మొన్న కొత్త ప్రధాని రాగా.
అప్పుడే ఎన్నికలు ఏంటంటూ ప్రజలు భావిస్తున్నారు.ఎన్నికలకు సంబంధించి అప్పుడే పలు సంస్థలు సర్వేలు నిర్వహిస్తున్నాయి.
ఈ నెలాఖరులో జరగనున్న ఫెడరల్ ఎన్నికల్లో అధికార లిబరల్ పార్టీకి మెజారిటీ వస్తుందని అన్ని పోల్స్ సూచిస్తుండగా.కెనడా ప్రధాని మార్క్ కార్నీ మరో నాలుగేళ్లు తన పదవీకాలాన్ని పొడిగించుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు విశ్లేషణలు వస్తున్నాయి.
ఎన్జీవో సంస్థ అంగస్ రీడ్ ఇన్‌స్టిట్యూట్ (ఏఆర్ఐ) (NGO Angus Reid Institute (ARI))విడుదల చేసిన సర్వే ప్రకారం లిబరల్స్ .పియరీ పోయిలివ్రే నేతృత్వంలోని ప్రతిపక్ష కన్జర్వేటివ్స్ కంటే 8 పాయింట్లతో ఆధిక్యంలో ఉన్నారు.వారం క్రితం ఏఆర్ఐ నిర్వహించిన పోల్ సర్వేలో కన్జర్వేటివ్స్‌కు 38 శాతం, లిబరల్స్‌కు 46 శాతం మంది జై కొట్టారు.మూడు నెలల క్రితం జస్టిన్ ట్రూడో (Justin Trudeau)ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో నిర్వహించిన సర్వేలో లిబరల్స్‌కు కేవలం 11 శాతం మద్ధతు లభించగా.
కన్జర్వేటివ్స్‌కు 45 శాతం మంది అండగా నిలిచారు.ఈ దశలో ట్రూడో(Trudeau) తన పదవికి రాజీనామా చేయగా.అతని వారసుడిగా కార్నీ రాగానే పరిణామాలు మారిపోయాయి.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడాపై (US President Donald Trump,Canada)చేసిన బెదిరింపులు లిబరల్స్‌కు కలిసొస్తున్నాయని నానోస్ రీసెర్చ్ చీఫ్ డేటా సైంటిస్ట్ నిక్ నానోస్ అన్నారు.నానోల తాజా గణాంకాల ప్రకారం కెనడియన్ ఔట్‌లెట్‌లైన గ్లోబ్ అండ్ మెయిల్, సీటీవీ న్యూస్‌లలో ప్రచురితమయ్యాయి.ఇందులో లిబరల్స్‌కు 44 శాతం, కన్జర్వేటివ్‌లకు 36 శాతం ఓటింగ్ వచ్చింది.
ఆ గణాంకాలు ఏఆర్ఐ గణాంకాలకు సమానంగా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అటు భారత సంతతికి చెందిన జగ్మీత్ సింగ్(Jagmeet Singh) నేతృత్వంలోని న్యూ డెమొక్రాటిక్ పార్టీ (ఎన్‌డీపీ) పుంజుకోవడం వల్ల లిబరల్స్ కూడా లాభపడుతున్నారు.ఏఆర్ఐ (NRI).ఎన్డీపీకి కేవలం 7 శాతం మద్ధతు మాత్రమే ఉందని.నానోలకు 11 శాతం మద్ధతు లభిస్తుందని అంచనా వేసింది.ఇప్సోస్ అనే ఏజెన్సీ విడుదల చేసిన మరో పోల్‌లో లిబరల్స్ 44 శాతంతో ఆధిక్యంలో ఉండగా.కన్జర్వేటివ్స్ 38 శాతంతో ముందంజలో ఉన్నారు.