హార్వర్డు విశ్వవిద్యాలయంలో ఈమధ్యే ఓ పరిశోధన జరిగింది.దాదాపు 27,000 మందిని ఈ అధ్యయనంలో పరిశీలించారు.16 ఏళ్ళుగా వారి ఆహారపు అలవాట్లును అడిగి తెలుసుకున్నారు.ఇందులో 13 శాతం మందికి బ్రేక్ఫాస్ట్ చేసే అలవాటు లేదంట.
వారిలో చాలారకాల ఆరోగ్య సమస్యలు కనిపించాయి.మరో భయానక నిజం ఏంటంటే, వారికి గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.
ఇక బ్రేక్ఫాస్ట్ లాంటి మంచి అలవాటు మానేసి, మద్యపానం, ధూమపానం లాంటి చెడు అలవాట్లు నేర్చుకుంటే గుండెపోటు వచ్చే ప్రమాదం 27% పెరుగుతుందట.
ఇలా ఎందుకు జరుగుతుంది అంటే, సరిగ్గా ఇదే కారణం అని చెప్పడానికి సరైన సాక్ష్యాలు ఇప్పుడే లేవు.
తెలిసినంతలో చెప్పాలంటే, ఉదయం బ్రేక్ఫాస్ట్ చేయకపోతే మధ్యాహ్నం ఆకలి ఎక్కువ వేస్తుంది.దాంతో అహారం ఎక్కువగా తీసుకోవాల్సి వస్తుంది.
ఒక్కసారిగా అంత ఆహారం శరీరంలోకి చేరితే షుగర్ లెవెల్స్ పెరిగిపోయి ఇన్సులిన్ ఉత్పత్తి దెబ్బతిని రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోతుంది.
అందుకే ఉదయాన్నే అల్పాహారం తీసుకోవాలి.
లేదంటే వచ్చే సమస్యల్లో గుండెపోటు ఒకటి.ఇలాంటి సమస్యలు ఇంకెన్నో వస్తాయి.
ఆలస్యంగా నిద్రలేవడం, ఆదరాబాదరాగా ఆఫీసుకి, కాలేజికి తయారవుతూ బ్రేక్ఫాస్ట్ ని మానేస్తుంటారు.ఇది ఏమాత్రం మంచిది కాదు.