మాపై నిందలు వేస్తూ కుట్రలకు పాల్పడుతున్నారు.. రోజా భర్త సంచలన వ్యాఖ్యలు వైరల్!

తమిళ‌ నిర్మాతల మండలి(Tamil Producers Council), దక్షిణ భాతర సినీ కార్మికుల సమాఖ్యకి మధ్య అభిప్రాయ బేధాలు ఉన్న విషయం మనందరికి తెలిసిందే.ఈ రెండు వర్గాల మధ్య కొంత కాలంగా తీవ్రమైన ఆరోపణలు ఒకరిపై మరొకరు చేసుకుంటూనే ఉన్నారు.

 Rk Selvamani Comments Kollywood Producers Council, Rk Selvamani, Kollywood, Comm-TeluguStop.com

నిర్మాతల నుంచి కార్మికులకు అందే వేతనాల విషయంలో ఈ వివాదం రాజకున్న విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ విషయంపై అనేకసార్లు వార్తలు వెలుగులోకి కూడా వస్తాయి.

తాజాగా ఈ గొడవలు కాస్త పతాక స్థాయికి చేరుకున్నాయి.ఈ క్రమంలో తమిళ‌ నిర్మాతల మండలి కార్మికులలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తుందని వార్తలు వస్తున్నాయి.

దక్షిణ భాతర సినీ కార్మికుల సమాఖ్యకి పోటీగా తమిళ్‌ సినీ కార్మికుల(Tamil film workers) సమాఖ్యను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రచారం వెలుగులోకి వచ్చింది.తమిళ్‌ సినీ కార్మికుల సమాఖ్య పేరుతో ఇటీవల ఒక దిన పత్రికలో ప్రకటన వెలువడింది.

దీంతో దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య అధ్యక్షుడు ఆర్‌కే.సెల్వమణి చెన్నైలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

తాము నిర్మాతల మండలి కోసం ఎంతగానో దిగొచ్చామని ఆయన తెలిపారు.కార్మికుల వేతనాల నుంచి చాలా విషయాల్లో నిర్మాతకు సహకరిస్తున్నామని ఆయన అన్నారు.

అయితే వారిలో ఐక్యత లేక సమస్యలను పరిష్కరించుకోలేక తమపై నిందలు వేస్తున్నారని ఆయన అన్నారు.

Telugu Kollywood, Rk Selvamani, Tamil, Tamilproducers-Movie

ఈ క్రమంలోనే కొత్తగా తమిళ్‌ సినీ కార్మికుల సమాఖ్య పేరుతో సంఘాన్ని ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని, అందులో భాగంగా ఇటీవల ఒక దిన పత్రికలో తమిళ్‌ సినీ కార్మికుల సమాఖ్య పేరుతో ఒక ప్రకటన విడుదల చేశారని అన్నారు.ఈ ప్రకటన వెనుక తమిళ్‌ నిర్మాతల మండలి(Tamil Producers Council) ఉందని తెలిసిందని సెల్వమణి అన్నారు.నిర్మాతల మండిలి తెలివిగా మా మధ్య గొడవ పెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు ఉందని అన్నారు.

కొందరు నిర్మాతలే ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని, వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా దక్షిణ భారత సినీ కార్మికుల సంఘం నుంచి ఒక్క కార్మికుడు కూడా బయటకు వెళ్లడని సెల్వమణి అన్నారు.కారణం తమ సమాఖ్య అంత కట్టుదిట్టంగా ఉందని, వారి శ్రేయస్సు కోసమే తాను నిరంతరం కృషి చేస్తున్నట్లు చెప్పారు.

ఇకపోతే నిర్మాతలు తమ చిత్రాల షూటింగ్‌ లను తమిళనాడులో కాకుండా ఇతర రాష్ట్రాలలో ఇతర దేశాల్లో చేస్తున్నారని, అందువల్ల తమిళ సినీ కార్మికులకు పని లేకుండా పోతోందని అన్నారు.తప్పనిసరి అయితేనే తమిళ చిత్రాల షూటింగ్‌ లను ఇతర రాష్ట్రాల్లో నిర్వహిస్తే బాగుంటుందని, తమిళ చిత్రాలను నమ్ముకుని 25 వేల మంది కార్మికుల ఉన్నారని ఆర్‌కే.

సెల్వమణి (R.K.Selvamani)తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube