సితార (Sitara)పరిచయం అవసరం లేని పేరు.సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) నమ్రత(Namrata)ల ముద్దుల కుమార్తెగా ఈమె అందరికీ ఎంతో సుపరిచితమే.
సితార ఇంత చిన్న వయసులోనే ఇప్పటికే పెద్ద ఎత్తున అభిమానులను సొంతం చేసుకున్నారు.ఇక అతి త్వరలోనే సితార హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్న నేపథ్యంలో ఈమె ఇప్పటికే విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు.
ఇంత చిన్న వయసులోనే యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి ఎన్నో డాన్స్ వీడియోలను షేర్ చేస్తూ ఉంటారు.

ఇలా ఇప్పటికే ఎంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న సితార పలు ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ప్రమోట్ చేస్తూ బ్రాండ్ అంబాసిడర్ గా కోట్లు సంపాదిస్తున్నారు.ఇక ఈమె పీఎంజె నగల సమస్త కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్ పంజాగుట్టలో పీఎంజె (PMJ Jewels) అతిపెద్ద షోరూమ్‌ను మహేష్ బాబు కూతురు సితార చేతుల మీదుగా ప్రారంభించారు.

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఎంతో మంది సినీ సెలబ్రిటీలు వ్యాపారవేత్తలు ఫ్యాషన్ ప్రియులు పాల్గొని సందడి చేశారు.ఇక ఈ జువెలరీ షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా సితార చూడ చక్కగా ఉన్నారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.రెడ్ కలర్ ట్రెండీ వేర్ ధరించి సితార ఎంతో చూడచక్కగా ఉన్నారు.ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారడంతో మహేష్ బాబు అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇక సితార హీరోయిన్గా ఇండస్ట్రీలోకి రావడానికి ఇప్పటికే శిక్షణ కూడా తీసుకుంటున్నట్టు తెలుస్తోంది .అతి త్వరలోనే ఈమె హీరోయిన్ గా ఇండస్ట్రీ లోకి రాబోతున్నారని తెలుస్తోంది.