క్యాన్సర్.( Cancer ) పేరు వింటేనే భయం, ఆందోళన మొదలవుతాయి.
క్యాన్సర్ అనేది శరీరాన్ని మాత్రమే కాకుండా మనసు, కుటుంబం, ఆర్థిక పరిస్థితులను తీవ్రంగా ప్రభావతం చేసే వ్యాధి.మన ఇండియాలోనే ప్రతి ఏడాది కొన్ని లక్షల మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు.
క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి.అందుకే క్యాన్సర్ పై అవగాహన పెంచుకోవాలి.
క్యాన్సర్ రిస్క్ ను పెంచే అలవాట్లకు దూరంగా ఉండాలి.
ఈ జాబితాలో మొదట చెప్పుకోవాల్సింది.
పొగతాగడం.ప్రస్తుత రోజుల్లో చాలా మంది యుక్త వయసు నుంచి స్మోకింగ్( Smoking ) ను అలవాటు చేసుకున్నారు.
అయితే ఈ అలవాటు లంగ్స్ క్యాన్సర్ తో పాటు మౌత్, ఎసోఫాగస్, బ్లాడర్, ప్యాంక్రియాస్ వంటి అనేక రకాల క్యాన్సర్‌కు కారణం అవుతుంది.మితిమీరిన మద్యం( Alcohol ) తీసుకునే అలవాటు కూడా క్యాన్సర్ రిస్క్ ను పెంచుతుంది.

అలాగే కొందరు ఎప్పుడు చూసినా ఖాళీగానే ఉంటారు.ఏ పని చేయరు.శరీరానికి ఎటువంటి శ్రమ పెట్టరు.ఈ అలవాటు మీకు ఉందా.? అయితే మీరు క్యాన్సర్ కు వెల్కమ్ చెప్పినట్లే.శారీరక క్రియాశీలత లేకపోవడం వల్ల బరువు పెరుగుతారు.
ఒబేసిటీ బారిపడతారు.ఒబేసిటీ( Obestiy ) అనేది బ్రెస్ట్, కొలన్, కిడ్నీ వంటి అనేక రకాల క్యాన్సర్స్‌కు పెద్ద రిస్క్ ఫ్యాక్టర్.

అధికంగా ప్రాసెస్డ్ ఫుడ్స్, రెడ్ మీట్, తక్కువ ఫైబర్ ఉన్న ఆహారం తీసుకున్న క్యాన్సర్ ముప్పు పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.ఇటీవల కాలంలో నిద్రను నిర్లక్ష్యం చేస్తున్నవారి సంఖ్య భారీగా పెరిగిపోతుంది.ఫోన్, టీవీ మోజులో పడి అర్థరాత్రి వరకు మేల్కొనే ఉంటున్నారు.నిద్రలో లోపం వల్ల హార్మోన్‌ల అసమతుల్యత ఏర్పడి కొన్ని క్యాన్సర్‌లకు దారితీస్తుంది.ఎక్కువ సేపు సన్ ఎక్స్‌పోజర్ అవ్వడం, రసాయనాలకు ఎక్స్‌పోజర్ అవ్వడం లేదా టానింగ్ బెడ్స్ వాడటం వల్ల చర్మ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.ఇక ఫ్యామిలీ హిస్టరీని కూడా చూసుకోవాలి.
జన్యుపరంగా క్యాన్సర్ రావొచ్చు.ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే జన్యుపరంగా వచ్చే క్యాన్సర్ల ముప్పును తగ్గించుకోవచ్చు.