టాలీవుడ్ లో హీరోల వారసులను పరిచయం చేసే అవకాశం పోగొట్టుకున్న దర్శకులు

మన తెలుగు సినిమా ఇండస్ట్రీలోని బడా హీరోల వారసులను పరిచయం చేసే బాద్యతలను ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లు మిస్ అయ్యారు అయితే ఆ వారసులు ఎవరు ఆ ఛాన్స్ ని మిస్ చేసుకున్న డైరెక్టర్స్ ఎవరు అనేది ఇప్పుడు డీటెయిల్ గా తెలుసుకుందాం.

 Tollywood Directors Missed A Chance To Introduce These Hero's , Rajamouli, Ramch-TeluguStop.com

1) రాజమౌళి, రామ్ చరణ్:

మెగాస్టార్ చిరంజీవి ఒక్కగానొక్క కుమారుడు రామ్ చరణ్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసే బాధ్యతను ముందుగా చిరంజీవి గారు తెలుగు గర్వించ దగ్గ సినిమాలను తీస్తున్న దర్శకుడు రాజమౌళికి అప్పగించాడు.అయితే రామ్ చరణ్ స్ట్రెంత్స్ అండ్ వీక్నెస్సెస్ తెలియకుండా నేను కథ రాసి సినిమాని తీయలేనని సుముఖంగానే చిరంజీవిగారి చెప్పి ఆ బాధ్యత నుండి తప్పుకున్నారట రాజమౌళ దాంతో ఆ అవకాశం పూరిగారు తీసుకొని చరణ్ కి చిరుత లాంటి సూపర్ హిట్ ఇచ్చాడు.ఇక రెండో సినిమా మగధీర రాజమౌళి గారు నిర్మించారు.ఆ సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన సంగతి మనకు తెలిసిందే.

2) మహేష్ బాబు, కృష్ణవంశీ:

సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుండి మహేష్ లాంటి నట వారసుడు వస్తున్నాడంటే అంచనాలు భారీగానే ఉంటాయి.సో, అంత భారాన్ని నేను మోయలేను అంటూ ఉన్న నిజం చెప్పి పక్కకు తప్పుకున్నాడు కృష్ణవంశీ.ఆ తర్వాత దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారు ఆ బాధ్యతను తీసుకొని మహేష్ కి రా

జకుమారుడు

లాంటి సూపర్ డూపర్ హిట్ ఇచ్చాడు.

ఈ సినిమాకి బెస్ట్ మేల్ డెబ్యూ కేటగిరిలో నంది అవార్డు గెలుచుకున్నాడు మహేష్.

Telugu Akhil Rana, Krishna Vamsi, Mahesh Babu, Naga Chaitanya, Rajamouli, Ramcha

3) మహేష్ బాబు, ఎస్వీ కృష్ణారెడ్డి:

అలీ జీవితంలో సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన యమలీల సినిమా కథని డైరెక్టర్ తేజ గారు ముందు కృష్ణ గారికి చెప్పారట.అయితే కృష్ణ గారు మహేష్ ఇంకా చదవుకుంటున్నాడు ఇప్పుడిప్పుడే సినిమాలు చేసే ఉద్దేశం లేదని చెప్పడంతో ఆ ఆవకాశం అలీకి వెళ్ళింది.అలా మహేష్ బాబును పరిచయం చేసే అవకాశం దర్శకుడు తేజగారికి దక్కలేదు.

Telugu Akhil Rana, Krishna Vamsi, Mahesh Babu, Naga Chaitanya, Rajamouli, Ramcha

4) తేజ, అల్లు అర్జున్:

హీరో నితిన్ నటించిన జయం సినిమా ఎంత పెద్ద హిట్టో మనందరికి తెలిసిందే అయితే డైరెక్టర్ తేజ ముందు ఈ కథకి హీరోగా అల్లు అర్జున్ ని అనుకున్నారట కానీ కొన్ని కారణాల వలన అల్లు అర్జున్ ఈ సినిమా చేయలేక పోయాడు.లేదంటే అల్లు అర్జున్ కెరియర్ లో ఈ సినిమా ఒక మైలురాయిగా నిలిచిపోయేది.

Telugu Akhil Rana, Krishna Vamsi, Mahesh Babu, Naga Chaitanya, Rajamouli, Ramcha

5) పూరీ జగన్నాథ్, నాగ చైతన్య:

అక్కినేని నట వారసుడు నాగచైతన్య ని కూడా డైరెక్టర్ పూరిగారే పరిచయం చేయాల్సివుంది .నాగార్జున గారు “చిరుత” సినిమా చూసి చరణ్ లాగే మా చైతన్యకు కూడా ఒక మంచి కథ రెడీ చేయమని పూరిగారికి చెప్పారట అయితే చివరి వరకు కథ ఓకే అవ్వకపోవడంతో డైరెక్టర్ వాసు వర్మ నాగచైతన్యను జోష్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం చేసాడు.

6) విక్రమ్ కే కుమార్, అఖిల్:

ఇక అక్కినేని నాగార్జున గారి రెండొవ అబ్బాయి అఖిల్ ని డైరెక్టర్ విక్రమ్ కే కుమార్ గారు పరిచయం చేయాల్సివుంది.అయితే అఖిల్ మొదటి సినిమా కాబట్టి కొంచం మాస్ ఎలిమెంట్స్ ఉంటే బావుంటుందని అందరూ అనుకోవడంతో వివి వినాయక్ గారు ట్రాక్ లోకి వచ్చారు.

అయితే అఖిల్ ని తెరమీద మొట్టమొదటి సారి చూపించింది మాత్రం డైరెక్టర్ విక్రమ్ గారే మనం సినిమా చివర్లో అఖిల్‌ను పరిచయం చేసాడు దర్శకుడు విక్రమ్ కే కుమార్.

Telugu Akhil Rana, Krishna Vamsi, Mahesh Babu, Naga Chaitanya, Rajamouli, Ramcha

7) రానా, రాఘవేంద్రరావు:

విక్టరీ వెంకటేష్ ని ఇండస్ట్రీకి పరిచయం చేసిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారి చేతుల మీదగాని దగ్గుబాటి నట వారసుడు రానాని కూడా పరిచయం చేద్దామని ముందుగా అనుకున్నారట.కానీ కొన్ని అనివార్య కారణాల వలన శేఖర్ కమ్ముల సీన్‌లోకి వచ్చి లీడర్ సినిమాని నిర్మించాడు.

Telugu Akhil Rana, Krishna Vamsi, Mahesh Babu, Naga Chaitanya, Rajamouli, Ramcha

8) క్రిష్, వరుణ్ తేజ్:

ఇక నాగబాబు గారి కొడుకు చిరంజీవి గారి నట వారసుడు వరుణ్ తేజ్ కి డైరెక్టర్ క్రిష్ ఒక మంచి కథ చెప్పారట ఆ కథ కి వరుణ్ తేజ్ కూడా బాగా కనెక్ట్ అయ్యాడట కానీ చిరంజీవి కాంపౌండ్ నుండి వస్తున్న 6 అడుగుల బుల్లెట్టు కాబట్టి అంచనాలు ఓ రేంజ్ లో ఉంటాయి కదా సో, కొంచం కమెర్షియల్ కథలు ఎంచుకోమని అందరూ చెప్పడంతో వరుణ్ ముకుంద సినిమా కథని ఓకే చేసాడు.దాంతో వరుణ్ తేజ్ ని ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత శ్రీకాంత్ అడ్డాల గారికి దక్కింది.

Telugu Akhil Rana, Krishna Vamsi, Mahesh Babu, Naga Chaitanya, Rajamouli, Ramcha

9) రాజమౌళి, ఎన్టీఆర్:

ఇక నందమూరి తారక రామారావు అంటూ పెద్దాయన పేరు పెట్టుకున్న జూనియర్ ఎన్టీఆర్ ని కూడా ముందు రాజమౌళి గారే ఇండస్ట్రీకి పరిచయం చేయాల్సివుంది.కానీ కాంబినేషన్ కుదరకపోవడంతో నిన్ను చూడాలని అనే సినిమాతో ఇండస్ట్రీకి వచ్చాడు జూనియర్ ఎన్టీఆర్.ఇక ఆతర్వాత రాజమౌళి గారు ఎన్టీఆర్ కి స్టూడెంట్ నెం 1, సింహాద్రి, యమదొంగ లాంటి ఇండస్ట్రీ హిట్టులిచ్చాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube