ఆ తప్పు చేయకుండా ఉండి ఉంటే బాగుండేది అని రోజు బాధపడుతున్న స్టార్స్ వీరే !

సినిమా ఇండస్ట్రీలో నటించే నటీనటులు తాము చేసిన కొన్ని పనుల విషయంలో అసంతృప్తిగానే ఉంటారు.అయితే బయటకు చెప్పడానికి మాత్రం ఇష్టపడరు.

 Stars Revealed Their Career Mistakes, Revathi, Sudhir Babu, Nayanthara, Suresh C-TeluguStop.com

కానీ ఈ మధ్యకాలంలో మీడియా మరియు సోషల్ మీడియా జోరు బాగా పెరిగిపోయింది.ఏదో ఒక రకంగా ఏదో ఒక వార్త ఏదో ఒక సెలబ్రిటీ గురించి వైరల్ అవుతూనే ఉంటుంది.

కొన్నిసార్లు పొరపాటున తమ తప్పుల గురించి సెలబ్రిటీస్ బయట పెడతారు మరికొన్నిసార్లు మీడియా బయటకు రప్పిస్తారు.ఏది ఏమైనా చాలామంది సెలబ్రిటీస్ కి ఏదో ఒక రిగ్రేట్ ఉంటూనే ఉంటుంది.

మరి కొంతమంది సెలబ్రిటీస్ తాము లైఫ్ లో తీసుకున్న నిర్ణయాల పట్ల అసంతృప్తిగా ఉన్నారు.ఆ సెలబ్రిటీస్ ఎవరు వారు చేసిన మిస్టేక్స్ ఏంటి అనే విషయాలను ఈ ఆర్టికల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

రేవతి

( Revathi )

హీరోయిన్ రేవతి చాలా చిన్న వయసులోనే ఇండస్ట్రీకి వచ్చారు.ఆమె మొదటి సినిమా 17వ సంవత్సరంలో రిలీజ్ అయింది ఆమె 20 ఏళ్ల వయసు వచ్చేసరికి తన తోటి నటుడు మరియు డైరెక్టర్ అయిన సురేష్ చంద్ర మీనన్( Suresh Chandra Menon ) తో వివాహం జరిగింది.

వీరిది ప్రేమ వివాహమే అయినప్పటికి మరి కొన్నేళ్ల పాటు సినిమాలు చేసి ఆ తర్వాత పెళ్లి చేసుకుని ఉంటే తన కెరియర్ మరియు పర్సనల్ లైఫ్ రెండు బాగుండేవని తనకు చిన్న వయసులో వివాహం జరగడం, ఆ నిర్ణయం తీసుకోవడం చాలా పెద్ద మిస్టేక్ అని అంటుంటారు రేవతి.

Telugu Badminton, Nayanthara, Revathi, Starsrevealed, Sudhir Babu, Sureshchandra

సుధీర్ బాబు

( Sudhir Babu )

కృష్ణ గారి ఇంటి అల్లుడు మహేష్ బాబు బావ అయిన సుధీర్ బాబు సినిమాల్లోకి రాకముందు బ్యాడ్మింటన్ ప్లేయర్ అనే విషయం మన అందరికీ తెలిసిందే.అయితే కెరియర్ చాలా పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు బ్యాడ్మింటన్( Badminton ) వదిలేసే సినిమాల్లోకి రావాలని నిర్ణయం తీసుకోవడం తాను చేసిన పెద్ద తప్పు అని సుధీర్ బాబు అంగీకరించారు.ఇంకొక మూడు, నాలుగు ఏళ్ల పాటు బ్యాడ్మింటన్ ఆడి ఉంటే బాగుండేదని ఆ తర్వాత సినిమాల్లోకి వస్తే ఆ రిగ్రేట్ ఉండకపోయేదని చెప్తున్నారు.

Telugu Badminton, Nayanthara, Revathi, Starsrevealed, Sudhir Babu, Sureshchandra

నయనతార

( Nayanthara )

ఇటీవల కాలంలో నయనతార విషయంలో ఒక వార్త వైరల్ అయింది.అదే ఆమె గజినీలో నటించడం.అది ఆమె తీసుకున్న తప్పు నిర్ణయం అంటూ ఆమె అంగీకరించారు.అందుకు గల కారణం కథ వివరించేటప్పుడు ఒకలా చెప్పి సినిమా పూర్తయ్యాక మరోలా చేశారు.అందుకే ఆ సినిమాలో నటించడం తాను చేసిన పెద్ద తప్పు అని నయనతార ఇటీవల వెలువరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube