కెనడా : నయాగరా జలపాతంలో దూకి భారతీయ విద్యార్ధి ఆత్మహత్య

కెనడాలో విషాదం చోటు చేసుకుంది.నయాగరా జలపాతంలో( Niagara Waterfalls ) దూకి ఓ భారతీయ విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడు.

 Indian Student Died In Canada Kin Demand Probe Details, Indian Student Died ,can-TeluguStop.com

మృతుడిని పంజాబ్ రాష్ట్రం లూథియానా జిల్లా అబ్బువల్ గ్రామానికి చెందిన చరణ్‌దీప్ సింగ్‌ (22)గా( Charandeep Singh ) గుర్తించారు.అతని మరణవార్తతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

చరణ్ తండ్రి ఓ సన్నకారు రైతు కావడంతో కుమారుడి మృతదేహాన్ని భారతదేశానికి తీసుకువచ్చేందుకు కావాల్సిన ఖర్చును భరించలేకపోతున్నారు.

కెనడాలోని( Canada ) బ్రాంప్టన్‌లో చరణ్‌దీప్‌కు రక్త సంబంధీకులు ఎవరూ లేకపోవడంతో .మృతదేహాన్ని గుర్తించడానికి భారత్‌లోని తల్లిదండ్రులు, సోదరి కణాల నమూనాను డీఎన్ఏ పరీక్షకు పంపాల్సి ఉంటుంది.దీనికి కొన్ని నెలల సమయం పట్టే అవకాశం వుంది.

చరణ్‌దీప్‌ను ఉన్నత చదువుల కోసం కెనడాకు పంపేందుకు అప్పులు చేసిన ఈ కుటుంబం ఇప్పటికే ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది.ఇంతలో అతని మరణవార్త, అందులోనూ కుమారుడి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి కావాల్సిన డబ్బును సమకూర్చడం చరణ్‌దీప్ తల్లిదండ్రులకు సవాలుగా మారింది.

Telugu Binder Kaur, Brampton, Canada, Canada Indian, Indian, Jora Singh, Kin Dem

ఈ నేపథ్యంలో మాజీ గ్రామ సర్పంచ్ రవీందర్ సింగ్ అబ్బువాల్ నేతృత్వంలోని గ్రామస్తులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను, ఎన్ఆర్ఐ దాతలను సాయం చేయాలని కోరుతున్నారు.చరణ్‌దీప్‌ను పది నెలల క్రితం స్టడీ వీసాపై పంపేందుకు అతని తల్లిదండ్రులు జోరా సింగ్,( Jora Singh ) బిందర్ కౌర్‌లు( Binder Kaur ) ఎన్నో వ్యయ ప్రయాసలను ఎదుర్కొన్నారని స్థానికులు చెబుతున్నారు.కెనడాకు వెళ్లినప్పటి నుంచి చరణ్ తన తల్లిదండ్రులు, సోదరికి క్రమం తప్పకుండా ఫోన్ చేసి మాట్లాడేవాడు.అయితే వారం క్రితం చరణ్‌దీప్ కనిపించడం లేదని అతని రూమ్‌మేట్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడంతో భారత్‌లోని అతని కుటుంబ సభ్యులు భయాందోళనలకు గురయ్యారు.

Telugu Binder Kaur, Brampton, Canada, Canada Indian, Indian, Jora Singh, Kin Dem

మృతుడి కుటుంబానికి సన్నిహితుడైన, కెనడాలోనే స్థిరపడిన ఎన్ఆర్ సుఖ్వీందర్ సింగ్ మాట్లాడుతూ.చరణ్‌దీప్ అదృశ్యమైనట్లు తెలిసిన వెంటనే బ్రాంప్టన్, నయాగరా జలపాతం ప్రాంతంలోని పోలీసులతో సమన్వయం చేసుకున్నానని చెప్పారు.చరణ్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ధృవీకరించారని సుఖ్వీందర్ తెలిపారు.అయితే తమ కుమారుడి మరణంపై దర్యాప్తు చేయాల్సిందిగా చరణ్‌దీప్ కుటుంబ సభ్యులు పోలీసులను డిమాండ్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube