వాము అనేది మన వంటగదిలో ఎప్పుడు అందుబాటులో ఉండే వస్తువు.వాములో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి.
వాము రుచిలో కొంచెం ఘాటుగా ఉన్నా ఆరోగ్య పరంగా ఎంతో సహాయాపడుతుంది.వాములో ఉండే పోషకాలు జీర్ణక్రియను వేగవంతం చేసి మలబద్దకం సమస్యను తగ్గిస్తుంది.
వాములో యాంటీ ఆక్సిడెంట్స్,పీచు పదార్ధం,ఖనిజాలు, విటమిన్స్ సమృద్ధిగా ఉన్నాయి.దగ్గు,జలుబు సమస్యతో బాధపడుతున్నప్పుడు వాముతో తయారుచేసిన కషాయాన్ని తీసుకుంటే మంచి ఉపశమనం కలుగుతుంది.
కొన్ని సార్లు పొడి దగ్గు ఎంతకు తగ్గకుండా బాధిస్తూ ఉంటుంది.అప్పుడు తమలపాకులో కొంచెం వాము వేసి తింటే దగ్గు తొందరగా తగ్గిపోతుంది.వాములో దియామిన్ అనే రసాయనం చెడు బ్యాక్టీరియాను నివారించటమే కాకుండా యాంటీ సెప్టిక్ గాను పనిచేస్తుంది.తిన్న ఆహారం జీర్ణం కాక కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడు కొంచెం వామును తింటే జీర్ణక్రియ బాగా జరిగి కడుపు ఉబ్బరం తగ్గుతుంది.
వాము,ధనియాలు,జీలకర్ర కషాయంగా కాచి త్రాగితే జ్వరం తొందరగా తగ్గిపోతుంది.సాధారణంగా గర్భిణీ స్త్రీలలో జీర్ణ సంబంధ సమస్యలు ఉంటాయి.అలాంటి సమయంలో కొంచెం వామును తింటే ఆ సమస్య నుండి బయట పడవచ్చు.వాము,తేనే కలిపి ఒక వారం రోజుల పాటు క్రమం తప్పకుండా తీసుకుంటే కిడ్నీలో రాళ్లు మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతాయి.
వామును కాస్త బెల్లంతో కలిపి తీసుకుంటే ఆస్తమా సమస్య నుండి బయట పడవచ్చు.వామును మెత్తని పేస్ట్ గా చేసి కీళ్ల నొప్పులు ఉన్నవారు పట్టులా వేస్తె కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది.
కీళ్ల నొప్పులు ఉన్నవారు వాము నూనెను రాసి మసాజ్ చేస్తే ఉపశమనం కలుగుతుంది.కడుపు నొప్పి ఉన్న సమయంలో కొంచెం వామును తీసుకుంటే తక్షణమే ఉపశమనం కలుగుతుంది.