రేవంత్ కు టార్గెట్ అయిపోయిన హరీష్ రావు

గత కొద్ది రోజులుగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) వ్వహత్మకంగా అడుగులు వేస్తున్నారు.తమ రాజకీయ ప్రత్యర్ధుల వ్యూహాలకు చిక్కకుండా పై చేయి సాధించే ప్రయత్నం చేస్తున్నారు .

 Why Cm Revanth Reddy Targeting Harish Rao Details, Cm Revanth Reddy, Revanth Red-TeluguStop.com

దీనిలో భాగంగానే బీఆర్ఎస్ ను టార్గెట్ చేసుకున్నారు.  ఎన్నికలకు ముందు ఆ తరువాత కొంతకాలం పాటు కేసీఆర్,  కేటీఆర్ లను టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు వ్యూహం మార్చారు.

గత కొద్ది రోజులుగా మాజీ మంత్రి హరీష్ రావును( Harish Rao ) టార్గెట్ చేసుకుని రేవంత్ విమర్శలు చేస్తున్నారు.

ఇటీవల కాలంలో తెలంగాణ కాంగ్రెస్ బాగా బలపడింది.

ఇక ఎన్నికలకు ముందు, తర్వాత కేసీఆర్,  కేటీఆర్ లను టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు వారి విషయాన్ని పట్టించుకోకుండా పూర్తిగా హరీష్ రావుని టార్గెట్ చేసుకోవడం పై అనేక అనుమానాలు కలుగుతున్నాయి.అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ ను( KTR ) తప్పించి ఆ బాధ్యతలను హరీష్ రావుకు అప్పగించాలానే డిమాండ్ ఎన్నికల్లో ఓటమి చెందిన దగ్గర నుంచి బీఆర్ఎస్ లో వినిపిస్తోంది.

Telugu Brs, Harish Rao, Revanthreddy, Telangana-Politics

హరీష్ రావు మళ్ళీ పార్టీ పగ్గాలు అప్పగించాలి అని చాలామంది నేతలు డిమాండ్ చేస్తున్నారు.  ఈ మేరకు మీడియా,  సోషల్ మీడియాలో హరీష్ రావు కు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు .ఈ నేపథ్యంలో కేసిఆర్( KCR ) కూడా పార్టీకి చెందిన నేతలతో ఈ విషయంపై చర్చిస్తున్నారు.దీంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా హరీష్ రావుకు అవకాశం దొరికే ఛాన్స్ కనిపించబోతూ ఉండడంతో,  ముందుగానే రేవంత్ రెడ్డి హరీష్ ను టార్గెట్ చేసుకున్నట్లుగా కనిపిస్తున్నారు.

Telugu Brs, Harish Rao, Revanthreddy, Telangana-Politics

అలాగే హరీష్ రావుకు అనుకూలంగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకునేందుకు ఆయనపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లుగా రేవంత్ వ్యవహరిస్తున్నారు.అందుకే ప్రతి విషయంలోనూ హరీష్ రావుని టార్గెట్ చేసుకుంటూ  బీఆర్ఎస్ ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube