తెలుగు ఇండస్ట్రీలోనైన, ఇటు రాజకీయాలలో అయినా నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.నందమూరి బాలకృష్ణకి అభిమానులు అంటే చాలా ఇష్టం.
కొన్ని సందర్భాలలో అభిమాన హీరోలపై అభిమానులు చూపించే ప్రేమానురాగాలకు అవధులు ఉండవనే చెప్పాలి.అలాగే అభిమానులను అగ్ర హీరోలు కూడా అలానే భావిస్తూ ఉంటారు.
వారికి వీలున్నప్పుడు మీటింగ్స్, ఫోటో షూట్ లాంటివి చేస్తూ ఉండడం మనం చూస్తూనే ఉంటాం.ఈ తరుణంలోనే బాలకృష్ణ తాజాగా అతని వీర అభిమానికి ఒక అరుదైన సందర్భం కల్పించాడు.
ప్రస్తుతం బాలకృష్ణ కర్నూల్ జిల్లా లోని( Kurnool District ) ఓర్వకల్ లోని రాక్ గార్డెన్స్ లో 109 చిత్రం( NBK109 ) షూటింగ్ జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే.ఈ తరుణంలో తన వీరాభిమాని నందమూరి యువసేన సేవా అధ్యక్షుడు సజాద్ కు బాలకృష్ణ కబురు పంపించారు.దీంతో సజాద్ వారి కుటుంబ సమేతంగా షూటింగ్ జరిగే స్థలానికి వచ్చి అభిమాన హీరోని కలిసి ముచ్చడించడంతో చాలా ఆనందానికి లోనయ్యాడు.అనంతరం బాలకృష్ణ సజాద్ వారి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు.
అంతేకాకుండా సజాద్( Sajad ) కుమారుడితో కూడా బాలకృష్ణ ముచ్చట్లు చేశారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ సందర్భంగా సజాద్ మాట్లాడుతూ బాలయ్య ఆత్మీయ పలకరింపు, ఆత్మీయ స్వాగతంతో ఎంతో సంతోషంగా ఉందంటూ తన ఆనందాన్ని వ్యక్తపరిచాడు.
ఇదిలా ఉండగా అప్పుడప్పుడు బాలకృష్ణ అభిమానులపై చేయి చేసుకోవడం లాంటి సంఘటనలు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.అయితే అలాంటి వీడియోలు ఎన్ని వచ్చిన అసలైన బాలయ్య అంటే ఇదే అంటూ వీడియో పై కామెంట్ చేస్తున్నారు బాలయ్య అభిమానులు.ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నాడు బాలయ్య.