సినిమా ఇండస్ట్రీలో కొనసాగి సెలబ్రిటీలు రెండు మూడు పెళ్లిళ్లు చేసుకోవడం సర్వసాధారణం అయింది.అయితే సినిమా ఇండస్ట్రీలో ఇలా పెళ్లి చేసుకుని విడాకులు ఇవ్వడం మరొకరితో రిలేషన్ లో ఉంటూ పెళ్లిళ్లు చేసుకోవడం అనేది సర్వసాధారణంగా జరుగుతుంది.
ఈ క్రమంలోనే ఓ హీరోయిన్ ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకుని తన ముగ్గురు భర్తలకు విడాకులు ఇచ్చి తిరిగి నాలుగో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు.వీరి పెళ్లి ముహూర్తం కూడా ఫిక్స్ అయినట్టు స్వయంగా నటి వెల్లడించారు.
మరి నాలుగో సారి పెళ్లి పీటలు ఎక్కబోతున్న ఆమె ఎవరు అనే విషయానికి వస్తే.ప్రముఖ నటుడు విజయ్ కుమార్( Vijay Kumar ) కూతురు నటి వనిత విజయ్ కుమార్( Vanitha Vijay Kumar ) అని చెప్పాలి.ఈమె చంద్రలేఖ( Chandralekha ) సినిమా ద్వారా హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమై పలు తెలుపు తమిళ భాష చిత్రాలలో నటించారు.ఈమె 2000వ సంవత్సరంలో నటుడు ఆకాష్ అనే వ్యక్తిని వివాహం చేసుకొని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు.
అయితే కొన్ని కారణాల వల్ల తన భర్తకు విడాకులు ఇచ్చారు.
ఇలా మొదటి పెళ్లి పెటాకులు కావడంతో తిరిగి మరో రెండు సార్లు పెళ్లి చేసుకున్నారు.అయితే ఈ రెండు పెళ్లిళ్లు కూడా ఎక్కువ కాలం పాటు నిలబడలేదు అయితే గత కొద్దిరోజులుగా ఈమె నాలుగో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి.అయితే ఆ వార్తలు నిజమేనని నటి వనిత వెల్లడించారు.
గత కొంతకాలంగా కొరియోగ్రాఫర్ రాబర్ట్( Choreographer Robert ) తో సహజీవనం చేస్తున్నటువంటి వనిత ఆయనని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైంది.అక్టోబర్ 5వ తేదీ వీరి వివాహం జరుగుతుందని వెల్లడించారు.
అయితే ఈమెకు పెళ్లీడుకు వచ్చిన పిల్లలు ఉండటం విశేషం.