సాధారణంగా తమిళ తంబీలకు కాస్త భాషాభిమానం ఎక్కువగా ఉంటుంది.అయితే దీనికైనా లిమిట్స్ అనేవి ఉంటాయన్న సంగతి మరుస్తారేమో గానీ, తమిళ తంబీలు ఇలాంటి విషయాలలో కాస్త అతిని ప్రదర్శిస్తారు అనడంలో అతిశయోక్తి లేదు.
అవును, తాజాగా తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్( Rajinikanth ) నటించిన సినిమా ‘వేట్టయన్’ సినిమా( Vettaiyan Movie ) నుండి ఫస్ట్ సింగల్ రిలీజ్ చేయడం జరిగింది.కానీ అదే పేరు అన్ని భాషల్లోనూ ఉంచేయడం తమిళుల పరాకాష్టకి అద్దం పడుతుంది.
తెలుగులో రిలీజ్ చేసేటప్పుడు తెలుగు పేరు ఉంటే తొందరగా దగ్గరవుతుంది కదా.అదే మిగతా భాషలకు వర్తిస్తుంది కూడా.కానీ తమిళ తంబీలకు అలాంటివేం పట్టవు.
ఇది వారికి కొత్తేమీ కాదు! ఈ విషయంలో మన తెలుగు వారు చాలా బెటర్ అని అనిపించక మానదు.వేట్టయన్ అనే టైటిల్ ని తెలుగులో వేటగాడు( Vetagadu ) అని పెడితే వారికి కలిగిన నష్టం ఏమిటి? అది సినిమాకు ఒక ఫ్రీ పబ్లిసిటీ లాగా ఉంటుంది కదా! వేటగాడు అనే టైటిల్ తో పెద్ద ఎన్టీఆర్ ఇండస్ట్రీ హిట్ కొట్టాడు ఆరోజుల్లో.పైగా రజినీకాంత్ కు అలాంటి టైటిల్ పెడితే ఊరమాస్ గా ఉంటుంది, తెలుగు ప్రేక్షకులకు తొందరగా కనెక్ట్ అవుతుంది కానీ, తమిళ తంబీలకు ఆ విషయం అనవసరం! వారి సాంబార్ పైత్యం వారిదే తప్పితే, మిగతవాళ్ళ గోల వారికి అనవసరం!
ఇక్కడ తమిళ సినిమాలను( Tamil Movies ) కూడా తెలుగుతో సమానంగా ఆదరించే అభిమానులు ఎంతోమంది ఉన్నారు.సత్యం సుందరం సినిమాను( Satyam Sundaram Movie ) ఒక స్ట్రైట్ తెలుగు సినిమాలా మనవాళ్లు అదరిస్తున్నారు.దానికి కారణం టైటిల్ తెలుగులో ఉండటమే అని ఇక్కడ వేరే చెప్పాల్సిన అవసరం లేదు.
ఏమాత్రం సినిమా నచ్చినా భాషతో సంబంధం లేకుండా బ్రహ్మరథం పట్టే ప్రేక్షకులు ఉన్నారు మా తెలుగులో.ఇపుడు అదే విషయంలో వారు బలుపు చూపిస్తున్నారేమో! తెలుగు తెగులువారు ఎలా ఉన్నా మన సినిమాలను అదరిస్తారు అనే విషయం వారికి బాగా తెలుసు.
కాబట్టి ముందు మారాల్సింది మనం.అప్పుడే అలాంటి కుంచిత స్వభావాలు కలిగినవారు మారేది!