తెలుగు సినిమా ఇండస్ట్రీ నీ కొన్ని దశాబ్దాలపాటు శాసించిన ఒకే ఒక హీరో మెగాస్టార్ చిరంజీవి.ఆయన నటించిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి.
ఖైదీ సినిమా తో ఇండస్ట్రీలో తనదైన మార్కు నటనతో అందరినీ అలరించిన చిరంజీవి అనతికాలంలోనే తన డ్యాన్సులు, ఫైట్లు తో ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపుతూ అప్పటివరకు ఉన్న మూస ధోరణి అంతటినీ బ్రేక్ చేసి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాడు.అలాంటి చిరంజీవి కెరీర్లో చాలా హిట్ సినిమాల్లో నటించి తనతో ప్రొడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్లకు మంచి లాభాలను తీసుకొచ్చి పెట్టాడు.
అలాగే నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకొని ఇప్పటికి టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరో గా కొనసాగుతున్న ఏకైక హీరో చిరంజీవి అనే చెప్పాలి.ప్రజారాజ్యం పార్టీ పెట్టి రాజకీయాల వైపు వెళ్లిన చిరంజీవి ఆ తర్వాత మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి ఖైదీ నెంబర్ 150 సినిమా తో మంచి గుర్తింపు సాధించుకున్నాడు.
దాని తర్వాత వచ్చిన సైరా సినిమా తో మంచి విజయాన్ని అందుకున్నాడు,ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఆచార్య సినిమాతో మళ్లీ మనల్ని అలరించడానికి మన ముందుకు రాబోతున్నాడు.ఇదిలా ఉంటే ఇప్పటివరకు మనకు హీరోగా మాత్రమే పరిచయమైన చిరంజీవి తన చుట్టూ ఉన్న బిజినెస్ ప్రపంచం గురించి ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం…
చిరంజీవి నటించిన అల్లు రామలింగయ్య గారి తో ఏర్పడిన పరిచయంతో తన కూతురు అయిన సురేఖ గారిని పెళ్లి చేసుకున్నారు.అల్లు రామలింగయ్య కొడుకు అయిన అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో చిరంజీవితో చాలా సినిమాలని ప్రొడ్యూస్ చేశారు అలా ఇండస్ట్రీలో ఒక పెద్ద ప్రొడ్యూసర్ గా గుర్తింపు పొంది, ప్రస్తుతం ఇండస్ట్రీ ని శాసించే స్థాయికి ఎదిగిపోయారు.ఇప్పుడు ఇండస్ట్రీలో పరిస్థితి ఎలా ఉందంటే అల్లు అరవింద్ ఏది చెప్తే అది జరిగేంతగా మారిపోయింది.
దాంతో చిరంజీవి అల్లు అరవింద్ సహాయంతో ఇండస్ట్రీని శాసించే స్థాయికి ఎదిగారు.అలాగే రామ్ చరణ్ భార్య అయిన ఉపాసన అపోలో గ్రూప్ చైర్మన్ వాళ్ళ మనవరాలు అవడంతో వైద్య రంగంలో కూడా తనదైన మార్కును చూపిస్తున్నారు చిరంజీవి.
అలాగే పెద్ద బిజినెస్ మాగ్నెట్ అయిన జివికె కుటుంబంతో కూడా చిరంజీవికి మంచి సంబంధం ఉంది అది ఎలా అంటే ఉపాసన వాళ్ల అమ్మా అయిన శోభన కి ఒక అక్క ఉంది ఆమె పేరు సంగీత రెడ్డి. సంగీత రెడ్డి భర్త చేవెల్ల ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి వీళ్ళ అబ్బాయి ఆనంద్ కి జీవీకే కుమార్తె అయిన షాలిని రెడ్డి కుమార్తె అయిన శ్రేయ భూపాల్ గారిని ఇచ్చి పెళ్లి చేశారు.దీంతో జీ.వీ.కె లాంటి వారు కూడా చిరంజీవికి రిలేషన్ గా మారిపోయారు.అలాగే టి.సుబ్బిరామిరెడ్డి గారు కూడా చిరంజీవికి దగ్గర బంధువే.అది ఎలా అంటే ఉపాసన వల్ల కజిన్ బ్రదర్ అయిన ఆనంద్ రెడ్డి మ్యారేజ్ చేసుకున్న శ్రేయ భూపాల్ వల్ల తల్లి అయిన శాలిని రెడ్డి కి ఒక బ్రదర్ ఉన్నాడు ఆయన పేరు సంజీవరెడ్డి వాళ్ల భార్య అయిన పింకీ రెడ్డి టి.సుబ్బిరామిరెడ్డి కూతురు.చిరంజీవి సినిమా ఇండస్ట్రీలో రాణిస్తూనే తన చుట్టూ బిజినెస్ లతో ఉన్న ప్రపంచాన్ని ఏర్పరుచుకున్నాడు.
ఎక్కడో చిన్న గ్రామంలో పుట్టి హీరోగా గుర్తింపు సాధించి ఆ తర్వాత బిజినెస్ పర్సన్స్ నీ కూడా తన కనుసైగలతో శాసిస్తున్నారు చిరంజీవి.ప్రస్తుతం దాసరి నారాయణ రావు తర్వాత ఇండస్ట్రీలో పెద్ద మనిషిగా చిరంజీవి గారు అన్ని బాధ్యతలు చూసుకుంటున్నారు ఎవరికీ ఏ ప్రాబ్లం వచ్చిన తనే దగ్గరుండి సాల్వ్ చేస్తున్నారు.
ఇండస్ట్రీలో ఏ హీరో సినిమా రిలీజ్ అవుతున్న రిలీజ్ ఫంక్షన్ కు అటెండ్ అవుతూ ఆ సినిమా టీంకి మంచి ఉత్సాహాన్ని ఇస్తున్నారు అలాగే ఆ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు కూడా పెంచుతున్నారు….