నీరసం ఉక్కిరి బిక్కిరి చేస్తుందా.. ఇలా చేశారంటే దెబ్బకు పరార్!

నీరసం( fatigue ) అనేది మనల్ని అత్యంత సర్వసాధారణంగా ఇబ్బంది పెడుతుంటుంది.అధిక శారీరక శ్రమ, రక్తహీనత, నిద్రలేమి, పలు అనారోగ్య సమస్యలు, ఎక్కువగా ప్రయాణాలు చేయడం తదితర కారణాల వల్ల ఒక్కోసారి నీరసం ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంటుంది.

 This Banana Anjeer Smoothie Helps To Get Rid Of Fatigue! Fatigue, Fatigue Relief-TeluguStop.com

నీరసం కారణంగా ఏ పని చేయలేకపోతుంటారు.నోటికి ఆహారం కూడా రుచించదు.

అయితే అలాంటి సమయంలో ఇప్పుడు చెప్పబోయే స్మూతీని కనుక తీసుకుంటే నీరసం దెబ్బకు పరార్ అవుతుంది.

స్మూతీ తయారీ కోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో మూడు డ్రై అంజీర్ ( Dry fig )లను వేసుకోవాలి.

అలాగే వన్ టేబుల్ స్పూన్ నల్ల ఎండు ద్రాక్ష, ఆరు బాదం గింజలు( Almonds ), వన్ టేబుల్ స్పూన్ నువ్వులు( spoon sesame seeds ), వన్ టేబుల్ స్పూన్ చియా సీడ్స్, నాలుగు గింజ తొలగించిన ఖర్జూరాలు మరియు ఒక కప్పు వాటర్ వేసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.మరుస‌టి రోజు బ్లెండర్ తీసుకొని అందులో నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్( Dry fruits ) ను వేసుకోవాలి.

అలాగే పీల్ తొలగించిన ఒక అరటిపండు, ఒక కప్పు కాచి చల్లార్చిన పాలు వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి.దాంతో బనానా అంజీర్‌ స్మూతీ అనేది రెడీ అవుతుంది.

Telugu Bananaanjeer, Tips, Latest-Telugu Health

ఈ స్మూతీ చాలా టేస్టీగా ఉంటుంది మరియు శరీరం కోల్పోయిన ఎనర్జీని తిరిగి నింపడంలో, నీరసాన్ని తరిమికొట్టడంలో అద్భుతంగా సహాయపడుతుంది.నీరసంగా ఉన్నప్పుడు ఈ స్మూతీని తీసుకుంటే సూప‌ర్ ఎనర్జిటిక్ గా మారతారు.పైగా ఈ స్మూతీ రక్తహీనతను నివారిస్తుంది.ఈ బనానా అంజీర్ స్మూతీలో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది, ఇది జీర్ణక్రియకు మరియు ఆరోగ్యకరమైన ప్రేగు కదలికలను నిర్వహించడానికి సహాయపడుతుంది.

Telugu Bananaanjeer, Tips, Latest-Telugu Health

ఈ స్మూతీలోని పొటాషియం మరియు మెగ్నీషియం మెదడు పనితీరుకు, మానసిక ఆరోగ్యానికి తోడ్పడతాయి.ఈ స్మూతీలో ఉపయోగించిన అంజీర్ లో జింక్ అనేది మెండుగా ఉంటుంది.ఇది పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ ను పెంచడంలో లైంగిక సమస్యలను దూరం చేయడంలో సహాయపడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube