ఆ సౌత్ డైరెక్టర్ నాతో ఇబ్బందికరంగా ప్రవర్తించాడు.. ఉపాసన సింగ్ కామెంట్స్ వైరల్!

నటి ఉపాసన సింగ్.( Upasana Singh ) ఈమె పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చే షో ది కపిల్ శర్మ.

 Upasana Singh Says South Director Asked Her To Meet At Hotel For Anil Kapoor Fil-TeluguStop.com

ఈ షోతో భారీగా గుర్తింపు తెచ్చుకుంది ఉపాసన.ప్రస్తుతం సెలబ్రిటీగా రాణిస్తున్న ఈమె కెరియర్ తొలినాలలో ఎదుర్కొన్న ఒడిదుడుకుల గురించి తాజాగా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

తాజాగా ఉపాసన సింగ్ మాట్లాడుతూ.ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సమయంలో నేనూ సమస్యలు ఎదుర్కొన్నాను.

దక్షిణాదికి చెందిన ఒక అగ్ర దర్శకుడి( South Director ) ప్రవర్తన వల్ల ఇబ్బంది పడ్డాను.బాలీవుడ్‌ నటుడు అనిల్‌ కపూర్‌ ను( Hero Anil Kapoor ) హీరోగా పెట్టి ఆయన ఒక సినిమా చేయాలనుకున్నారు.

Telugu Actressupasana, Anil Kapoor, Bollywood, Misbehavior, Upasana, Upasana Sin

అందులోకి నన్ను హీరోయిన్‌ గా ఎంచుకున్నారు.ఆ మేరకు అగ్రిమెంట్‌ పై సంతకం కూడా చేశాను.ఈ సినిమాకు సంబంధించిన ప్రతి మీటింగ్‌ కు అమ్మ, చెల్లిని తోడు తీసుకువెళ్లేదాన్ని.ప్రతి మీటింగ్‌ కు వాళ్లనెందుకు తీసుకువస్తున్నావ్‌? అని ఒక రోజు ఆ దర్శకుడు నన్ను ప్రశ్నించాడు.ఒక సారి రాత్రి 11.30 గంటలకు ఫోన్‌ చేసి సిట్టింగ్‌ కోసం హోటల్‌ కు రమ్మని అడిగాడు.నా వద్ద కారు లేదని, రేపు ఉదయం ఆఫీస్‌ కు వచ్చి కథ వింటానని బదులిచ్చాను.దానికి ఆయన.నీకు సిట్టింగ్‌కు సరైన అర్థం తెలియదా? అని అడిగాడు.

Telugu Actressupasana, Anil Kapoor, Bollywood, Misbehavior, Upasana, Upasana Sin

అప్పుడు నేను షాక్ అయ్యాను.ఆ తర్వాత రోజు ఉదయాన్నే కార్యాలయానికి వెళ్లి అక్కడ ఉన్న వాళ్లందరి ముందు ఆయన్ని తిట్టి బయటకు వచ్చేశాను.ఆ ప్రాజెక్ట్ నా చేయి జారిపోవడంతో ఎంతో ఏడ్చేశాను.

ఆ ఘటన తర్వాత వారం రోజుల పాటు ఇంటి నుంచి బయటకు రాలేదు.అనిల్ కపూర్‌ తో సినిమా చేస్తున్నానని అందరికీ చెప్పాను.

ఇప్పుడు వాళ్లకు ఏం చెప్పాలా? అని ఆలోచించా.కానీ ఆ ఏడు రోజులే నన్ను మరింత స్ట్రాంగ్‌ గా మార్చాయి.

అమ్మ నాకెంతో సపోర్ట్‌ చేసింది.ఎన్ని సమస్యలు వచ్చినా ఇండస్ట్రీ వదలకూడదని అప్పుడే నిర్ణయించుకున్నాను అని చెప్పుకొచ్చింది ఉపాసన.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube