సాధారణంగా కొందరికి ముఖం మొత్తం ఒక రంగులో ఉంటే మెడ మాత్రం నల్లగా వేరుపాటుగా కనిపిస్తుంది.మెడ డార్క్ కలర్ లోకి( Dark Neck ) మారడానికి చాలా కారణాలు ఉంటాయి.
ఎండల ప్రభావం, శరీరంలో అధిక వేడి, డెడ్ స్కిన్ సెల్స్ పేరుకుపోవడం, హార్మోన్ చేంజ్ వంటి కారణాల వల్ల మెడ అనేది నల్లగా మారుతుంటుంది.డార్క్ నెక్ వైట్ గా మార్చుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.
మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే రెమెడీ మీ మెడ నలుపును వదిలించడానికి బెస్ట్ సొల్యూషన్ అవుతుంది.మరి ఇంతకీ ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.
ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో నాలుగు టేబుల్ స్పూన్లు ఎర్ర కందిపప్పు,( Red Toor Dal ) రెండు టేబుల్ స్పూన్లు పెసలు( Green Gram ) వేసి మెత్తని పౌడర్ మాదిరి గ్రైండ్ చేసుకుని ఒక బాక్స్ లో స్టోర్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ ఎర్ర కందిపప్పు, పెసల పౌడర్ ను వేసుకోవాలి.అలాగే వన్ టీ స్పూన్ కాఫీ పౌడర్,( Coffee Powder ) వన్ టీ స్పూన్ ఆరెంజ్ పీల్ పౌడర్, వన్ టీ స్పూన్ తేనె మరియు సరిపడా పచ్చిపాలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని మెడకు అప్లై చేసి 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై వాటర్ తో శుభ్రంగా మెడను క్లీన్ చేసుకుని మాయిశ్చరైజర్ ను రాసుకోవాలి.
రెండు రోజులకు ఒకసారి ఈ సింపుల్ రెమెడీని కనుక పాటించారంటే ఆశ్చర్యపోయే రిజల్ట్ మీ సొంతమవుతుంది.ఈ రెమెడీ మెడ నలుపును క్రమంగా మాయం చేస్తుంది.చర్మం పై పేరుకుపోయిన మురికి మృత కణాలను తొలగిస్తుంది.టాన్ ను రిమూవ్ చేస్తుంది.మెడ తెల్లగా కాంతివంతంగా మెరిసేలా ప్రోత్సహిస్తుంది.మెడ నలుపుతో బాధపడుతున్న వారికి ఈ హోమ్ రెమెడీ చాలా ఎఫెక్టివ్ గా సహాయపడుతుంది.
కాబట్టి తప్పకుండా ప్రయత్నించండి.