శరీరంలో క్యాల్షియం లోపం(Calcium deficiency) ఉంటే ఎన్నో అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి.అతి ముఖ్యంగా శరీరంలో ఉండే ఎముకలు పై ఎక్కువగా ప్రభావం పడుతుంది.
ఎందుకంటే ఎముకలకు క్యాల్షియం ఎంతో అవసరం.ఆ క్యాల్షియం లోపం కలిగితే నిత్యం కీళ్ల నొప్పులు(Joint pains), ఆకస్మికంగా ఎముకలు విరగడం(breaking bones) లాంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.
అదేవిధంగా క్యాల్షియం లేకపోతే దంతాలు (teeth)కూడా బలహీనంగా మారిపోతాయి.
అదేవిధంగా చిన్నపిల్లల అభివృద్ధిపై కూడా ప్రభావితం అవుతుంది.
అలాంటి పరిస్థితుల్లో క్యాల్షియం పుష్కలంగా ఉండే ఆహారాలను తీసుకోవడం చాలా అవసరం.క్యాల్షియం పుష్కలంగా ఉండే ఆహారం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.అందుకే క్యాల్షియం అధికంగా ఉండే రిచ్ ఫుడ్స్ ను మీ డైలీ డైట్ లోకి చేర్చుకోవాలి.100 గ్రాముల పాల లో దాదాపు 125 mg కాల్షియం ఉంటుంది.100 గ్రాముల పన్నీర్ లో 480 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది.

అందుకే ఈ క్యాల్షియం ఎక్కువగా ఉన్న రెండు ఆహారాలని క్యాల్షియం లోపం ఉన్నవారు తీసుకోవాలి.అల్పాహారంలో కానీ రాత్రి పడుకునే ముందు కానీ వీటిని ఆహారంగా తీసుకోవచ్చు.అలాగే సోయాబీన్ లో కూడా క్యాల్షియం ఉంటుంది.
అదేవిధంగా ఇది ఆరోగ్యానికి అనేక విధాలుగా కూడా మేలు చేస్తుంది.ఎముక పెరుగుదలను ప్రోత్సహించడంతో పాటు ఎముక సాంద్రతను పెంచడంలో కూడా ఇది సహాయపడుతుంది.

అందుకే సోయాబీన్ తో కూరగాయలను తయారు చేసుకొని తీసుకోవడం మంచిది.అదేవిధంగా డ్రై ఫ్రూట్స్ తీసుకోవడంలో కూడా మంచి ఫలితాలు ఉంటాయి.డ్రై ఫ్రూట్స్ లలో పిస్తా, వాల్నట్ లో క్యాల్షియం అధికంగా ఉంటుంది.అందుకే ఈ రెండింటినీ రెగ్యులర్ గా తీసుకుంటే క్యాల్షియం లోపం ఉండదు.ఇవి ఎముకల పెరుగుదలను ప్రోత్సహించడంతోపాటు మెదడుకు బూస్టర్లుగా కూడా పనిచేస్తాయి.అలాగే దంతాలను, ఎముకలను బలంగా చేస్తాయి.







