Winter Drink : వింట‌ర్ లో త‌ప్ప‌కుండా తాగాల్సిన డ్రింక్ ఇది.. ఎందుకో తెలుసా?

ప్రస్తుతం వింటర్ సీజన్ నడుస్తున్న సంగతి తెలిసిందే.ఈ సీజన్ లో జలుబు, దగ్గు, జ్వరం, ఆస్తమా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తదితర సమస్యలన్నీ చుట్టుముట్టి ఉక్కిరి బిక్కిరి చేస్తుంటాయి.

 This Is A Must Have Drink In Winter, Winter Drink, Winter, Health, Health Tips,-TeluguStop.com

పైగా ఈ సీజన్ లో బద్ధకం కారణంగా వ్యాయామాలను నిర్లక్ష్యం చేస్తుంటారు.ఫలితంగా శరీర బరువు సైతం అదుపు తప్పుతుంటుంది.

అయితే ఆయా సమస్యలన్నిటికీ చెక్ పెట్టడంలో ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ అద్భుతంగా సహాయపడుతుంది.ఈ డ్రింక్ సీజనల్ వ్యాధులకు అడ్డుకట్ట వేయడం కాదు వెయిట్ లాస్ కు కూడా గ్రేట్ గా సహాయపడుతుంది.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ డ్రింక్ ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? వంటి విషయాలపై ఓ లుక్కేయండి.

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోయాలి.

వాటర్ కాస్త హీట్ అవ్వగానే అందులో ఐదు నుంచి ఆరు తులసి ఆకులు, హాఫ్‌ టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు, ఆఫ్ టేబుల్ స్పూన్ వెల్లుల్లి ముక్కలు, పావు టేబుల్ స్పూన్ పసుపు, వన్ టేబుల్ స్పూన్ వాము, వన్ టేబుల్ స్పూన్ మెంతులు, చిటికెడు మిరియాల పొడి వేసుకుని ప‌ది నుంచి ప‌దిహేను నిమిషాల పాటు మరిగించాలి.

అనంతరం స్టవ్ ఆఫ్ చేసి స్టైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.

ఈ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ తేనెను మిక్స్ చేసి ఉదయాన్నే ఖాళీ కడుపుతో సేవించాలి.ఈ డ్రింక్ ను తీసుకోవడం వల్ల రోగ‌నిరోధక వ్యవస్థ బలపడుతుంది.

దీంతో జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధులు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.ఆల్రెడీ ఈ సమస్యలు వేధిస్తుంటే.

వాటి నుంచి త్వరగా ఉపశమనం పొందుతారు.

Telugu Tips, Healthy, Latest-Telugu Health Tips

శ్వాస సంబంధిత సమస్యలు ఏమైనా ఉంటే దూరం అవుతాయి.అలాగే ఈ డ్రింక్ ను తీసుకోవడం వల్ల క్యాలరీలు చాలా వేగంగా కరుగుతాయి.దీంతో వెయిట్ లాస్ అవుతారు.

అంతేకాదు ఈ డ్రింక్ ను తీసుకోవడం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ కరిగి గుండె ఆరోగ్యంగా మారుతుంది.శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు సైతం తొలగిపోతాయి.

కాబట్టి ప్రస్తుత వింటర్ సీజన్ లో తప్పకుండా ఈ డ్రింక్ ను డైట్ లో చేర్చుకునేందుకు ప్రయత్నించండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube