చింతపండు. రోజువారీ వంటల్లో దీనిని విరి విరిగా ఉపయోగిస్తుంటారు.
పులుసు కూరలు, సాంబార్, రసం, పులిహోర, చట్నీలు ఇలాంటి వాటికి చింత పండు ఖచ్చితంగా ఉండాల్సిందే.పుల్లగా పుల్లగా ఉండే చింత పండు వంటలకు చక్కని రుచి తీసుకు వస్తుంది.
అందుకే చింతపండును తెగ ఇష్టపడుతుంటారు.కొందరైతే డైరెక్ట్‌గా కూడా చింత పండును తినేస్తుంటారు.
ఇక చింత పండులో పోషకాలు కూడా మెండుగానే ఉంటాయి.
విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ కె, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్, షుగర్స్, ప్రోటీన్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా ఎన్నో పోషకాలు చింత పండు నిండి ఉన్నాయి.
అటువంటి చింత పండు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.ముఖ్యంగా బరువును తగ్గించడంలోనూ, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు దరి చేరకుండా చేయడంలోనూ, జీర్ణ శక్తిని మెరుగు పరచడంలోనూ, గుండె జబ్బులు వచ్చే రిస్క్ తగ్గించడంలోనూ ఇలా ఎన్నో విధాలుగా చింత పండు ఉపయోగాలు ఉన్నాయి.
అయితే చింత పండు ఆరోగ్యానికి ఎంత మేలు చేసినప్పటికీ.దాని వల్ల కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి.అవును, చింత పండును అతిగా తీసుకోవడం లేదా రెగ్యులర్‌గా తీసుకోవడం చేస్తే.కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.ఒక వేళ కిడ్నీలో రాళ్లు ఉన్న వారు అయితే చింత పండు చాలా తక్కువగా తీసుకోవాలి.
అలాగే చింత పండుకు రక్త పోటును తగ్గించే గుణం ఉంది.
అధిక రక్త పోటు సమస్యతో బాధ పడే వారికి ఇదే వరమే.కానీ, లో బ్లడ్ ప్రెషర్ ఉన్న వారు చింత పండు అతిగా తీసుకుంటు.
రక్త పోటు స్థాయిలో మరింత తగ్గిపోతుంది.దాంతో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఇక మధుమేహం వ్యాధి ఉన్న వారు కూడా చింత పండును రెగ్యులర్‌గా తీసుకోవడం మంచిది కాదు.అలా చేస్తే.
రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉంటుంది.మరియు వయసు పైబడిన వారు కూడా చింత పండును డైలీ తీసుకోరాదు.