దశహర అనే సంస్కృత పదం క్రమంగా దసరాగా మారింది.మనలోని పది అవగుణాలను హరించేది ఈ ‘దశహర’ పండుగ1.
కామ (Lust)2.క్రోధ (Anger)3.మోహ (Attachment)4.లోభ (Greed)5.మద (Over Pride)6.మాత్సర్య (Jealousy)7.స్వార్థ (Selfishness)8.అన్యాయ (Injustice)9.అమానవత్వ (Cruelty)10.అహంకార (Ego)ఈపది దుర్గుణాలపై విజయం సాధించే శక్తినిచ్చేది కనుక దీనిని “విజయదశమి” అనికూడా అంటారు.
దసరా పండుగ ఇతివృత్తం:
బ్రహ్మదేవుని వరాల వలన వర గర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధం చేసి వారిని ఓడించి ఇంద్ర పదవి చేపట్టాడు.దేవేంద్రుడు త్రిమూర్తులతో మొర పెట్టుకొనగా మహిషునిపై వారిలో రగిలిన క్రోధాగ్ని ప్రకాశవంతమైన తేజముగా మారింది.త్రిమూర్తుల తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీరూపమై జన్మించింది.శివుని తేజము ముఖముగా, విష్ణు తేజము బాహువులుగా, బ్రహ్మ తేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె 18 బాహువులను కలిగి ఉంది.
ఆమెకు శివుడు శూలమును, విష్ణువు చక్రమును, ఇంద్రుడు వజ్రాయుధమును, వరుణ దేవుడు పాశము , బ్రహ్మదేవుడు అక్షమాల, కమండలము హిమవంతుడు సింహమును వాహనంగాను ఇచ్చారు.ఇలా సర్వదేవతల ఆయుధములు సమకూర్చుకొని మహిషాసురుని సైన్యంతో తలపడి భీకరమైన పోరు సల్పింది.
మహిషాసురుని తరఫున పోరు సల్పుతున్న ఉదద్రుడు, మహాహనుడు, అసిలోముడు, బాష్కలుడు, బిడాలుడు మొదలైన వారిని సంహరించిన తరువాత మహిషాసురునితో తలపడినది.ఈ యుద్దములో ఆదేవి వాహనమైన సింహమూ శత్రువులను చీల్చి చెండాడింది.
దేవితో తలపడిన అసురుడు మహిషిరూపము, సింహరూపము, మానవరూపముతో భీకరముగా పోరి చివరకు తిరిగి మహిషిరూపములో దేవిచేతిలో హతుడైనాడు.ఈ విధంగా అప్పటి నుండి మహిషుని సంహరించిన దినము దసరా పర్వదినం.
అందరూ ఆపరమేశ్వరి పూజలలో తరించి, జగదంబ అనుగ్రహం తో కళత్ర పుత్ర పౌత్ర ఆరామాలతో సుఖసౌఖ్యాలను పొందాలని మనసారా కోరుకుంటూ, అందరికీ విజయదశమి శుభాకాంక్షలు.
.DEVOTIONAL