మన దేశవ్యాప్తంగా చాలా మంది ప్రజలు కార్తీక మాసాన్ని ఎంతో ఘనంగా సంతోషంగా వారి కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకుంటారు.అంతేకాకుండా కార్తీక మాసంలో మూడో సోమవారం ఈ పూజలను చేస్తే శివుడి అనుగ్రహం ఆ కుటుంబంపై ఉంటుందని చాలా మంది భక్తులు నమ్ముతారు.
ఏ సోమవారం అయినా శివయ్యకు ఇష్టమే కానీ కార్తిక సోమవారం అంటే ఇంకా చాలా ఇష్టం.సోమవారం రోజు శివుడికి బిల్వ దళాలతో పూజ చేస్తే మనసులోని మంచి మంచి కోరికలు నెరవేరుతాయి.
ముత్తైదువులకు భక్తిశ్రద్ధలతో శివుని పూజిస్తే మంగళ సౌభాగ్యం లభిస్తుందని చాలామంది ఆడవారు నమ్ముతారు.
అయితే ఉపవాస దీక్షను కూడా చేస్తే మోక్షం లభిస్తుందని భక్తులు నమ్ముతారు.
కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం ఉపవాసం, పూజ చేయకపోయినా కనీసం మూడవ సోమవారం రోజు ఈ నియమాలు అన్నిటిని పాటిస్తే మంచిది.శివలింగానికి రుద్రాభిషేకం చేయడం వల్ల ఆ ఇంట్లో డబ్బు, ఆహారానికి ఎప్పుడు కొరత ఉండదు.
అయితే మారేడు చెట్టును త్రిమూర్తి స్వరూపంగా, లక్ష్మీదేవి రూపంగా చాలామంది భక్తులు ఆరాధిస్తారు.మహాశివుడికి మారేడు దళం అంటే ఎంతో ఇష్టమని, అందుకే మారేడును శివేష్ట అని కూడా పిలుస్తూ ఉంటారు.
మారేడు చెట్టు మహా మంగళకరమైనదని చాలామంది భక్తులు బలంగా నమ్ముతారు.మారేడు పత్రాలు మూడు ఆకులతో ఉన్నందున త్రిశూలానికి సంకేతంగా చాలామంది భక్తులు భావిస్తారు.ఈశ్వరారాధనలో మారేడు దళాలను తప్పనిసరిగా ఉపయోగించడం వల్ల శివుని అనుగ్రహం ఆ ఇంటిపై ఎప్పుడూ ఉంటుంది.పూజలో ఎంత ఎక్కువ బిల్వ పత్రాలు వాడితే అంత ఎక్కువ కరుణాకటాక్షాలు ప్రసాదిస్తాడని భక్తులు నమ్ముతారు.
అందుకే చాలామంది భక్తులు ఏకంగా కోటి బిల్వ పత్రాలతో శివునికి పూజలు చేస్తూ ఉంటారు.ఇంకా చెప్పాలంటే సర్వ శుభాలను అందించి మోక్షాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి బిల్వ వృక్షాన్ని దైవంతో సమానంగా కూడా చాలామంది భక్తులు పూజలు చేస్తూ ఉంటారు.
DEVOTIONAL