స్వయంగా శ్రీరామ చంద్రుడే ఓ పక్షికి దహన సంస్కారాలు చేశాడా?

స్యయంగా శ్రీరామ చంద్రుడే జటాయువు అనే పక్షికి దహన సంస్కారాలు నిర్వహించాడు.అసలు ఆయనకు ఆ జటాయువుకు సంబంధం ఏమిటి? ఆ పక్షి చనిపోతే శ్రీ రాముడు ఎందుకు దహన సంస్కారాలు నిర్వహించాడో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

 What Is The Reason Behind Sri Rama Bury A Bird, Sri Rama, Jatayuvu , Laxmana, S-TeluguStop.com

జటాయువు ఓ గద్ద.ఇతడు శ్వేని, అనూరుల కుమారుడు.వీరికి ఇద్దరు కుమారులు కాగా మొదటి వాడు సంపాతి.రెండో వాడు జటాయువు.

శ్రీరామ చంద్రుడి తండ్రి అయిన దశరథుడు జటాయువు స్నేహితుడు.శ్రీరామ చంద్రుడు.సీతా లక్ష్మణ సమేతంగా అడువులకు రావడం.అనంతరం రావణాసురుడు వచ్చి సీతను ఎత్తుకు వెళ్లడం మన అందరికీ తెలుసు.కానీ సీతను రావణాసురుడు అపహరిస్తున్నప్పుడు మాత్రం ఎవరూ చూడలేరు, ఒక్క జటాయువు మాత్రమే చూశాడు.రావణాసురుడి చెంత నుంచి సీతను రక్షించేందుకు జటాయువు తీవ్రంగా కష్టపడతాడు.

కానీ ఆ రెక్కలు పోగొట్టుకొని ఓడిపోతాడు.ఆ తర్వాత కొన ప్రాణంతో ఉన్న జటాయువు శ్రీరాముడి వద్దకు చేరి… సీతా దేవిని రావణాసురుడు అపహరించినట్లు చెబుతాడు.

ఆ తర్వాత ప్రాణాలు విడుస్తాడు.

జటాయువు త్యాగానికి చలించిన శ్రీ రాముడు చాలా బాధపడతాడు. స్వయంగా తన చేతులతో తానే దహన సంస్కారాలు నిర్వహిస్తాడు.తమ్ముడు జటాయువు చనిపోయినట్లు చాలా రోజుల వరకు ఆయన అన్న సంపాతికి తెలియదు.

చాలా కాలం తర్వాత తమ్ముడి మరణ వార్త తెలుసుకొని తల్ల డిల్లి పోతాడు.ఇలా ఓ గరుడ పక్షికి శ్రీ రామ చంద్రుడు అంత్యక్రియలు నిర్వహించినట్లు వాల్మికీ రామాయణంలో ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube