ఈ దేవాలయాన్ని దర్శిస్తే.. పెళ్లి కాని వారికి పెళ్లి సంతానం లేని వారికి..

If You Visit This Temple ,temple,marriage,offspring,Ancient Glorious Temples,Bhimeswara Swamy Temple,Chebrolu, Guntur District,Samarlakota Kumara Bhimeswara Swami,Draksharamam Bhimeswara Temple

మన దేశ వ్యాప్తంగా ఎన్నో పురాతనమైన మహిమగల దేవాలయాలు ఉన్నాయి.అలాంటి దేవాలయాలను సందర్శిస్తే అనుకున్న మంచి మంచి కోరికలు నెరవేరుతాయని చాలామంది భక్తులు నమ్ముతారు.

 If You Visit This Temple ,temple,marriage,offspring,ancient Glorious Temples,bhi-TeluguStop.com

గుంటూరు జిల్లా చేబ్రోలు లో ఉన్న భీమేశ్వర స్వామి దేవాలయం చోళుల కాలం నాటిది.ఈ దేవాలయం రెండు ప్రాకారాలుగా ఉంది.

రెండో ప్రకారములో స్వామి వారు కొలువై ఉంటారు.ఈ దేవాలయం ద్రాక్షరామం భీమేశ్వరాలయం సామర్లకోట కుమార భీమేశ్వర స్వామి దేవాలయాలను ఈ దేవాలయం పోలి ఉండడం విశేషం.

ఈ దేవాలయాన్ని దర్శించుకుంటే అవివాహితలకు త్వరగా పెళ్లి అవుతుందని చాలామంది భక్తులు విశ్వసిస్తారు.అంతే కాకుండా సంతానం లేని పెళ్లయిన జంటలకు సంతానం కలుగుతుందని భక్తులు గట్టిగా నమ్ముతారు.

ఈ కాలంలో కూడా మూడ నమ్మకాలు అని చెప్పేవారు చాలామంది ఉన్నారు.అయిన కూడా ఈ దేవాలయాన్ని ప్రతిరోజు ఎంతో మంది భక్తులు వచ్చి దర్శించుకుంటూ ఉంటారు.

గుంటూరు జిల్లా చేబ్రోలు ఆధ్యాత్మిక కేంద్రానికి ఈ దేవాలయం నిలయం.అక్కడ అద్భుత విశేష పురాతన ఆలయాలు ఉన్నాయి.

ఈ ఊరంతా ఎటు వెళ్లిన ఆలయాలు, పాడుబడిన బావులు, శిథిలా పురాతన నిర్మాణాలు మనకు కనబడుతూ ఉంటాయి.ఇక్కడ నూట ఒకటి దేవాలయాలు, 101 బావులు ఉండేవని స్థానికులు చెబుతూ ఉంటారు.

కాలం మారుతున్న కొద్ది అవన్నీ అంతరించిపోయాయని ఇప్పటికీ కొన్ని మాత్రమే మిగిలి ఉన్నాయని చెబుతూ ఉంటారు.మరికొన్ని ఆలయాలలో నిత్యం ధూప దీపారాధన జరుగుతూ ఉంటుంది.అలాంటి దేవాలయాలలో భీమేశ్వర స్వామి దేవాలయం ఒకటి.చేబ్రోలులోని భీమేశ్వర స్వామి దేవాలయాన్ని క్రీ.శ 892లో చాళుక్య భీమరాజు కట్టించారు.దాన్ని భీమరాజు భీమేశ్వరాలయంగా మార్చడానికి చరిత్రకారులు భావిస్తున్నారు.

విశాలమైన ఆవరణ దాని లోపల ప్రకారం మధ్యలో భీమేశ్వరాలయం ఉంటాయి.

Video : ఈ దేవాలయాన్ని దర్శిస్తే పెళ్లి కాని వారికి పెళ్లి సంతా #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube