అర్ధరాత్రి నడిరోడ్డుపైకి పడేశారు.. ప్రముఖ నటి ఆవేదన..?

కోలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న విజయలక్ష్మికి సినిమా కష్టాలు ఎదురవుతున్నాయి.గత కొన్ని నెలల నుంచి విజయలక్ష్మి ఆమె సోదరితో కలిసి టీ నగర్ లో ఉన్నటువంటి ఒక సర్వీస్ అపార్టుమెంట్ లో నివాసం ఉంటున్నారు.

 Actress Vijyalaksmi Facing Money  Problems  Actress Vijayalakshmi,  Facing Money-TeluguStop.com

అయితే ఆర్థిక సమస్యలు, ఇతర కారణాల వల్ల ఆమె గత మూడు నెలల నుంచి సరైన సమయానికి అద్దెను చెల్లించలేకపోయారు.

కొన్ని రోజుల క్రితం విజయలక్ష్మి సోదరికి అనారోగ్య సమస్య ఎదురు కాగా ఆమె సోదరితో కలిసి ఆస్పత్రిలో ఉండగా శనివారం రాత్రి విజయలక్ష్మి సోదరిని వైద్యులు డిశ్చార్జ్ చేశారు.

అయితే విజయలక్ష్మి సోదరితో కలిసి ఇంటికి చేరుకున్న సమయంలో ఆమె ఫ్లాట్ లో మరో వ్యక్తి అద్దెకు ఉన్నారు.ఫ్లాట్ లో మరో వ్యక్తి ఉండటంతో ఆమె మేనేజర్ విఘ్నేశ్వరర్ ను ప్రశ్నించగా అద్దె చెల్లించకపోవడం వల్ల ఆమె సామాన్లు మరో గదిలో పెట్టామని మేనేజర్ వెల్లడించారు.

Telugu Problems, Kollywood, Seeman-Movie

ఫ్లాట్ లో వెళ్లే అవకాశం లేకపోవడంతో ఆమె మీడియాను పిలిచి తనను అర్ధరాత్రి నడిరోడ్డుపైకి పడేశారని వెల్లడించారు.కొన్ని రోజుల క్రితం యాక్టర్, డైరెక్టర్, నామ్ తమిళర్ కట్చి నేత అయిన సీమాన్ తనను మోసం చేశారంటూ విజయలక్ష్మి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.ఎన్నికల సమయంలో సైతం సీమాన్ కు వ్యతిరేకంగా విజయలక్ష్మి ప్రచారం నిర్వహించడం గమనార్హం.

అయితే శనివారం రాత్రి మాత్రం విమర్శలు చేసిన సీమాన్ తనకు సహాయం చేయాలంటూ ఆమె కోరడం గమనార్హం.

అయితే పోలీసులు విజయలక్ష్మికి ప్రత్యామ్నాయం కల్పించారు.విజయలక్ష్మి సినిమా కష్టాల గురించి ఆమె అభిమానులు ఆవేదన చెందుతుండటం గమనార్హం.

అయితే సీమాన్ కు వ్యతిరేకంగా పని చేయడం వల్లే ఆమెను రోడ్డుపై పడేశారని కూడా ప్రచారం జరుగుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube