ముఖ చర్మాన్ని వైట్ గా, బ్రైట్ గా మరియు షైనీగా మెరిపించుకోవడం కోసం చాలా మంది మార్కెట్లో లభ్యమయ్యే ఖరీదైన క్రీములను కొనుగోలు చేసి వాడుతుంటారు.అయితే ఆ క్రీముల వల్ల ఎంత ప్రయోజనం ఉంటుంది అన్నది పక్కన పెడితే.
వాటిలో ఉండే పలు కెమికల్స్ భవిష్యత్తులో వివిధ రకాల చర్మ సమస్యలను తెచ్చి పెడతాయి.కానీ ఇప్పుడు చెప్పబోయే న్యాచురల్ క్రీమ్ మాత్రం మీ ముఖాన్ని తెల్లగా, ప్రకాశవంతంగా మార్చడమే కాదు మరెన్నో ప్రయోజనాలను సైతం అందిస్తుంది.
పైగా ఈ హోమ్ మేడ్ క్రీమ్‌ను వాడటం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.మరి ఇంతకీ ఆ క్రీమ్ ఏంటి.? దాన్ని ఎలా తయారు చేసుకోవాలి.? వంటి విషయాలను ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక బౌల్‌ను తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ ములేటి(అతిమధురం) పౌడర్, రెండు టేబుల్ స్పూన్లు షియా బటర్ ను వేసుకోవాలి.
అలాగే వన్ టేబుల్ స్పూన్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్ లేదా ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ వేసుకుని హ్యాండ్ బ్లెండర్ సహాయంతో ఐదారు నిమిషాల పాటు బాగా మిక్స్ చేయాలి.
ఇలా మిక్స్ చేస్తే ములేటి ఫేస్ క్రీమ్ సిద్ధమవుతుంది.ఈ క్రీమ్ ను ఒక బాక్స్ లో నింపుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.ఈ హోమ్ మేడ్ క్రీమ్ ను రోజు నైట్ నిద్రించే ముందు ముఖానికి అప్లై చేసుకుని పడుకోవాలి.
ప్రతి రోజు కనుక ఈ క్రీమ్‌ను వాడితే.ముఖ చర్మం వైట్ గా, బ్రైట్ గా మరియు షైనీగా మెరుస్తుంది.చర్మంపై ఏమైనా మచ్చలు, మొటిమలు ఉంటే క్రమంగా మాయం అవుతాయి.
ముడతలు నుండి విముక్తి లభిస్తుంది.పైగా ఈ క్రీమ్ ను కళ్ళ కింద అప్లై చేస్తే డార్క్ సర్కిల్స్ సైతం తగ్గుముఖం పడతాయి.