రామాయణం( Ramayanam ) అంటే రాముని చరిత్ర అని దాదాపు మన దేశంలో చాలామంది ప్రజలు కచ్చితంగా చెబుతారు.కానీ అది ఎంత మాత్రం నిజం కాదు.
రామాయణం అంటే రాముని మార్గమని పండితులు చెబుతున్నారు.రామాయణం చదువుకోవాల్సింది రాముని కథ( Sri Rama ) విని ఆనందించడానికి కాదు.
రాముడు నడిచిన మార్గం తెలుసుకొని ఆచరించడానికి అని పండితులు చెబుతున్నారు.న్యాయం అంటే ఏమిటి, ధర్మం అంటే ఏమిటి, వాటిని ఎలా ఆచరణలో పెట్టాలి.
మాటకు కట్టుబడి ఎలా బ్రతకాలి? ఎలాంటి కష్టం వచ్చినా మాట తప్పకుండా ఇలా జీవించాలి? వంటి అనేక అంశాలు తెలుసుకోవడానికి రామాయణం కచ్చితంగా చదవాలని పండితులు చెబుతున్నారు.
సాధారణంగా హిందువుల ఇళ్లలో రామాయణ పారాయణం చేస్తుంటారు.రామాయణం పఠించడం వల్ల మన శరీరంతో పాటు మనసు కూడా శుద్ధి అవుతుందని ప్రజలు నమ్ముతారు.రామాయణం చదివేటప్పుడు లేదా పారాయణం చేసేటప్పుడు కొన్ని నియమాలను కచ్చితంగా పాటించాలి.
సరైన సంస్కారాలు పద్ధతుల ప్రకారం చదివేటప్పుడే రామాయణ పఠనం( Ramayanam Reading ) వల్ల కలిగే ప్రయోజనం లభిస్తుంది.సరైన పద్ధతిలో చదవడం ఎలా, రామాయణం చదివేటప్పుడు ఏ నియమాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రతి రోజు రామాయణం చదువుతున్నప్పుడు యుద్ధకాండ చివరి భాగమైన రామాయణ మహాత్మ్యం తప్పకుండా చదవాలి.అప్పుడే రామాయణం మొత్తం పఠించినంత పుణ్యఫలం లభిస్తుంది.రామాయణ పారాయణం చేసేటప్పుడు మీరు పాత పుస్తకాన్ని ఉపయోగించకూడదు.దానికి బదులుగా కొత్త పుస్తకాన్ని,అలాగే పేజీలు సరిగ్గా ఉండే పుస్తకాన్ని ఉపయోగించాలి.రామాయణం చదివేటప్పుడు చిరిగిన లేదా పాడైపోయిన పుస్తకాన్ని కూడా ఉపయోగించకూడదు.రామాయణం చదివేటప్పుడు అందులో అన్ని పదాలను సరిగ్గా చదవాలి.
ప్రతి పదాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి.రామాయణాన్ని ఎంతో ఏకాగ్రతతో చదవాలి.
ఉత్తరాభిముఖంగా రామాయణం చదవడం ఎంతో మంచిది.ఇంకా చెప్పాలంటే సూర్యుడు అస్తమించే సమయంలో రామాయణం చదవకూడదు.
DEVOTIONAL