మన ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగితే అందుకు ఎన్నో పద్ధతులు, ఆచారాలను పాటిస్తారు.అయితే ఈ ఆచార సంప్రదాయాలు ఒక్కొక్కరు ఒక్కో విధంగా పాటిస్తుంటారు.
ఏ రాష్ట్రానికి చెందినవారు వారి సంప్రదాయ పద్ధతులలో ఎంతో అద్భుతంగా జరుపుకుంటారు.వివాహం జరిగేటప్పుడు ఎన్నో సాంప్రదాయాలను పాటిస్తూ, వివాహాన్ని ఘనంగా జరుపుకుంటారు.
ఎన్నో పూజలు, నోములు, కన్యాదానం, జీలకర్ర, బెల్లం ఇలాంటి కార్యక్రమాలు మనం తరచూ చూస్తూ ఉంటాం.అయితే పెళ్లిళ్లలో ఎక్కువమంది రోలు, రోకలి కి పూజలు నిర్వహిస్తుంటారు.
పెళ్లిళ్లలో రోలు, రోకలి ఉపయోగించడానికి గల కారణాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం….

ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాలలో పెళ్లిళ్లలో రోలు,రోకలికు ఎక్కువ ప్రాధాన్యత కల్పిస్తూ, వాటిని ప్రత్యేకంగా అలంకరించి పూజిస్తుంటారు.ఇలా రోలు, రోకలి, తిరగలి ఈ మూడు మానవ జీవితంలో ఎంతో ముడిపడి ఉన్నాయి.పూర్వకాలంలో ఏవైనా ధాన్యాలను తయారు చేసుకోవాలంటే వాటిని ఉపయోగించి మెత్తగా పిండి చేసుకునేవారు.
వీటి ద్వారా చేసుకునే ఆహార పదార్థాలు తినడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉండేవి.అందుకే అప్పటి తరం వారు ఎంతో ఆరోగ్యంగా ఎక్కువ కాలం జీవించేవారు.
కాలం మారే కొద్ది మన ఆచార సంప్రదాయాలు సైతం కనుమరుగైపోతున్నాయి.అంతేకాకుండా బలరాముడు నాగలిని, రోకలిని ఆయుధాలుగా ధరించేవాడు.
ఇదేవిధంగా రోలును లక్ష్మీదేవి గా,రోకలిని విష్ణువుతో, తిరగలిని శివుడితో సమానంగా భావిస్తారు.అంతేకాకుండా వీటి ద్వారా వచ్చిన పిండిని పార్వతీదేవితో పోల్చుకోవడం వల్ల పెళ్లిలో వీటిని పూజిస్తే ఆ దేవతల ఆశీర్వాదాలు ఎల్లవేళలా మనకి ఉంటాయని భావిస్తారు.
అంతేకాకుండా వీటిని పూజించినవారికి ధనప్రాప్తి, మానసిక సంతోషం కలుగుతాయని ప్రగాఢ విశ్వాసం.ఈ విధంగా పెళ్లిళ్లలో రోలు, రోకలి ఉపయోగించి ఆ రోజు వాటికి ప్రత్యేక పూజలతో పూజిస్తుంటారు.