ఐపీఎల్( IPL ) టోర్నీలో రెండో రోజు ఢిల్లీ వర్సెస్ లక్నో( DC Vs LSG ) మధ్య జరిగిన మ్యాచ్ లో లక్నో ఘన విజయం సాధించింది.ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో మొదట బ్యాటింగ్ కి దిగిన లక్నో జట్టు 20 ఓవర్ లలో ఆరు వికెట్ల నష్టానికి 193 పరుగులు చేయడం జరిగింది.
దీంతో 194 పరుగుల లక్ష్యంతో రెండో బ్యాటింగ్ కి దిగిన ఢిల్లీ 20 ఓవర్ లకు 9 వికెట్ల నష్టానికి 143 పరుగులు మాత్రమే చేయగలిగింది.దీంతో 50 రన్స్ తేడాతో ఢిల్లీ జట్టు పై లక్నో విజయం సాధించింది.
లక్నో బౌలర్ లలో మార్క్ వుడ్( Mark Wood ) ఐదు వికెట్లను తీసి.ఢిల్లీ టీంలో కీలక ఆటగాలను వెన్ను విరిచాడు.

ఇంకా బీష్నోయ్, అవేష్ ఖాన్ చెరో రెండు వికెట్లు తీయడం జరిగింది.ఢిల్లీ టీమ్ లో డేవిడ్ వార్నర్ 56, రోసో 30, అక్షర పటేల్ 16 మినహా మిగతా బ్యాట్స్ మ్యాన్ లు తక్కువ స్కోరుకే వెనుతిరిగారు.మొదట బ్యాటింగ్ చేసిన లక్నో జట్టులో ఓపెనర్ కేల్ మేయర్స్ 38 బంతుల్లో 73 పరుగులు చేసి చెలరేగిపోయాడు.పురన్ 36, బదోని 7 బంతుల్లో 18 పరుగులు చేయడం జరిగింది.
లక్నో టీం భారీ స్కోర్ చేయడంతో రెండో బ్యాటింగ్ దిగిన ఢిల్లీ ఆటగాళ్లు ఒత్తిడి లోనయి రాణించలేకపోయారు.లక్నో జట్టు ఈ టోర్నీలో ఢిల్లీతో గెలిచి మొదటి విజయం నమోదు చేసుకుంది.







