చెరుకు పంటను( Sugarcane crop ) తీవ్రంగా నష్టం కలిగించే పురుగులలో పీక పురుగులు( Pests ) ప్రధాన పాత్ర పోషిస్తాయి.వాతావరణం లో మార్పులు సంభవించినప్పుడు ఈ పురుగుల ఉద్ధృతి పెరిగి తక్కువ సమయంలోనే పంటను ఆశించి నాశనం చేస్తాయి.
సకాలంలో ఈ పీక పురుగులను గుర్తించి, కొన్ని యాజమాన్య పద్ధతులు పాటించి పంటను రక్షించుకోవాలి.చెరుకు పంట వేసిన మూడు నెలలకు పీక పురుగులు పంటను ఆశించే అవకాశాలు ఉన్నాయి.
పంట పొలంలో ఉష్ణోగ్రత అధికంగా ఉన్న సమయంలో వీటి ఉద్ధృతి పెరుగుతుంది.వీటిని మువ్వు పురుగులు అని కూడా పిలుస్తారు.
చెరుకు మొక్కలోని మొవ్వులోకి ప్రవేశించి, తొలుచుకుంటూ లోపలికి ప్రవేశించి కణజాలాన్ని తినేయడంతో మొక్కలు క్షీణించి చనిపోతాయి.వాతావరణం లో అధిక ఉష్ణోగ్రతలు, గాలిలో తేమశాతం తక్కువగా ఉన్నప్పుడు, పంట ఆలస్యంగా నాటినప్పుడు, వేసవిలో నీటి ఎద్దడి సమస్య అధికంగా ఉన్నప్పుడు ఈ పీక పురుగులు పంటను ఆశిస్తాయి.
పీక పురుగుల నుండి పంటను సంరక్షించడం కోసం పాటించాల్సిన జాగ్రత్తలు: చెరకు ముచ్చులను 20 సెంటీమీటర్ల లోతులో నాటుకోవాలి.నాటిన తర్వాత వీలైనంత తొందరగా నీటి తడి అందించాలి.
ఒక ఎకరా నాలుగు లింగాకర్షక బుట్టలు నాటిన 30 రోజుల నుండి 120 రోజుల వరకు పొలంలో అమర్చి ఈ పురుగుల ఉనికిని గుర్తించాలి.చెరుకు నాటే బోదెల్లో కార్బో ప్యూరాన్ 3G గుళికలు 15 కిలోలు లేదా పిప్రోనిల్ 0.3G పది కిలోలను 1:2 నిష్పత్తి ఇసుకతో కలిపి వేసుకోవాలి.ఆ తర్వాత చెరుకు నాటుకోవాలి.పంట వేశాక పురుగుల ఉద్ధృతి సాధారణంగా ఉంటే ఎసిఫేట్ 1.0 గ్రాములు లీటర్ నీటిలో కలిపి పంటకు పిచికారి చేసుకోవాలి.ఇలా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు పురుగుల ఉనికిని గుర్తించి, ఏమైనా అనుమానాలు ఉంటే వ్యవసాయ క్షేత్రం నిపుణుల సలహాలు తీసుకోవాలి.







