చియాన్ విక్రం, అతని తనయుడు ధృవ్ కలిసి చేసిన మూవీ మహాన్.కార్తిక్ సుబ్బరాజు డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు చిత్రయూనిట్.
విక్రం, ధృవ్ పోటా పోటీగా నటించిన మహాన్ సినిమా కొన్నాళ్లుగా రిలీజ్ వాయిదా పడుతూ వస్తుంది.ఫైనల్ గా ఈ సినిమాని డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ ఫిక్స్ చేశారు.
అమేజాన్ ప్రైం లో విక్రం, ధృవ్ ల మహాన్ మూవీ ఫిబ్రవరి 10న రిలీజ్ అవుతుంది.ఈ సినిమా తమిళ వర్షన్ తో పాటుగా మళయాళ, కన్నడ, తెలుగు వర్షన్ కూడా అదే రోజు డిజిటల్ రిలీజ్ చేస్తున్నారు.
డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా చియాన్ ఫ్యాన్స్ ని మెప్పిస్తుందని అంటున్నారు.ఆదిత్య వర్మతో ధృవ్ తొలి సినిమాతో మెప్పించగా నట వారసుడు చేసిన సెకండ్ సినిమా ఇదే అవడం విశేషం.
సెకండ్ సినిమానే తండ్రితో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు ధృవ్.ఈ సినిమాలో వాణి భోజన్, సిమ్రాన్ ఫీమేల్ లీడ్ గా నటించారు.
సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాని సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ లో ఎస్.ఎస్ లలిత్ కుమార్ నిర్మించారు.