పాలుఆరోగ్యానికి, చర్మానికి, కేశాలకు ఎంతో మేలు చేస్తాయన్న సంగతి తెలిసిందే.పౌష్టికాహారంగా అభివర్ణించే పాలలో కాల్షియం, పొటాషియం, సోడియం, మెగ్నీషియం, జింక్, ఫోలెట్, ప్రోటీన్, గుడ్ ఫ్యాట్స్, విటమిన్ ఎ, విటమిన్ డి, విటమిన్ బి6, విటమిన్ బి12, శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా ఎన్నో పోషక విలువలు నిండి ఉంటాయి.
అందుకే పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరినీ ప్రతి రోజు ఒక గ్లాస్ పాలు తీసుకోమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
అయితే కొందరు వేడి పాల కంటే చల్లటి పాలను తీసుకోవడానికి ఇష్టపడుతుంటారు.
కానీ, చల్లటి పాలను తాగరాదని పెద్దలు చెబుతుంటారు.మరి చల్లటి పాలు తాగొచ్చా ? తాగరాదా ? అంటే ఆరోగ్య నిపుణులు నిశ్చితంగా తాగమనే చెబుతున్నారు.పైగా కాచి చల్లార్చిన పాలను తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా పొందొచ్చని అంటున్నారు నిపుణులు.మరి ఆలస్యం చేయకుండా ఆ హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి.
వాస్తవానికి వేడి పాలతో పోలిస్తే చల్లటి పాలలోనే కాల్షియం ఎక్కువగా ఉంటుంది.అందు వల్ల, ఎముకల బలహీనతతో బాధ పడే వారు.చల్లటి పాలు తీసుకుంటే మంచిది.తద్వారా ఎముకలు, దంతాలు మరియు కండరాలు దృఢంగా మారతాయి.అలాగే శరీర వేడిని తగ్గించడంలో చల్లటి పాలు గ్రేట్‌గా సహాయపడతాయి.కాబట్టి, ఇకపై ఎప్పుడైనా వేడి చేస్తే.
చల్లటి పాలను తాగేయండి.
నిద్ర లేమితో ఇబ్బంది పడే వారు ప్రతి రోజు చల్లటి పాలు తీసుకుంటే ఒత్తిడి, టెన్షన్స్ దూరమై మంచి నిద్ర పడుతుంది.ఎసిడిటీ సమస్యను నివారించడంలోనూ చల్లటి పాలు సూపర్‌గా సహాయపడతాయి.అవును, చల్లటి పాలను తాగితే ఎసిడిటీతో పాటుగా కడుపునొప్పి, అల్సర్ వంటి సమస్యలు దూరం అవుతాయి.
ఇక చల్లటి పాలను తాగడం వల్ల అతి ఆకలి కూడా తగ్గు ముఖం పడుతుంది.దాంతో తినడం తగ్గిస్తారు.ఫలితంగా బరువు తగ్గుతారు.