ఆర్టీసీ కార్గో పార్శిల్ మిస్సింగ్.. టెన్షన్ పడుతున్న అధికారులు.. ఎందుకంటే?

ప్రస్తుత రోజులలో చాలా మంది ఆన్లైన్ షాపింగ్ ( Online shopping )కు బాగా అలవాటు పడిపోయారు.ఈ క్రమంలో బుక్ చేసిన ఆర్డర్స్ కరెక్ట్ సమయానికి డెలివరీ అవుతాయో లేదో కూడా అర్థమవని పరిస్థితిలు చాలానే ఉన్నాయి.

 Rtc Cargo Parcel Missing Officials Are Under Tension Because, Rtc Cargo, Saree,-TeluguStop.com

ఇలాంటి క్రమంలో కస్టమర్లు ఎదుర్కొనే సవాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అనేక తిప్పలు పడి చివరకు ఆ పార్సల్ వస్తుందో లేదో కూడా అర్థం అవ్వని పరిస్థితులలో చాలా మంది ఉన్నారు.

అచ్చం అలాంటి సంఘటనని ఒకటి ఒంగోలులో చోటు చేసుకుంది.గత కొన్ని రోజులుగా ఆర్టీసీ కార్గో సర్వీస్ ( RTC Cargo Service )లను అందజేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

పార్సల్స్ ను కరెక్ట్ సమయానికి డెలివరీ చేస్తున్న క్రమంలో చాలామంది ఆర్టీసీ కార్గో సేవలపై ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు.

Telugu Latest, Onelak, Rtc Cargo, Rtc-Latest News - Telugu

అయితే, వినుకొండ డిపోకు రావలసిన పార్సల్లు రాకపోవడంతో కార్గో ఉద్యోగులు చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు.ఇందుకు సంబంధించి పూర్తి వివరాలలోకి వెళ్తే.వినుకొండ( Vinukond )నుంచి తిరుపతికి ఒక ఆర్టీసీ బస్ అద్దెకు వెళ్ళింది.

ఈ క్రమంలో ఒంగోలులో 16 పార్సెల్స్ ఇచ్చారు.ఈ పార్సల్స్ అన్నీ కూడా నెల్లూరు వరకు బుక్ అయ్యి ఉన్నాయి.

అయితే, ఈ క్రమంలో 15 పార్సల్లు మాత్రమే కార్గో ఆఫీస్లోకి వచ్చాయి.కానీ, మరొక పార్సల్ రాలేదు.

దీంతో ఉద్యోగులందరూ కూడా చాలా కంగారుగా ఉన్నారు.అయితే, బస్సు డ్రైవర్ ఆ పార్సెల్ ను కార్గో ఆఫీస్ లో ఇవ్వలేదని కనిపెట్టేశారు.

ఇంకేముంది అతని పట్టుకొని పార్సల్ తీసుకొని రావాలని అనేక ఇబ్బందులు పడుతున్నారు.కాకపోతే, అప్పటికే ఆ డ్రైవర్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసాడు.

అద్దె బస్సు డ్రైవర్ ( Bus driver )కావడంతో అతన్ని జాడ తెలుసుకోవడం చాలా కష్టతరంగా మారింది.

Telugu Latest, Onelak, Rtc Cargo, Rtc-Latest News - Telugu

ఇంతకీ మిస్ అయిన పార్సెల్ లో ఏముందన్న విషయానికి వస్తే.ఒక లక్ష రూపాయలు విలువ చేసే చీర ఉంది.అంత విలువ చేసిన చీర మిస్ అవ్వడంతో యజమాని ఆర్టీసీ కార్గో ఉద్యోగులపై ఒత్తిడి కలిగించాడు.

వాస్తవానికి ఆ చీర బుక్ చేసిన యజమాని ఎవరో కాదండోయ్.ఆర్టీసీ చైర్మన్ కోడలు.దీంతో కార్గో లో పని చేసే ఉద్యోగులందరికి ఒక పెద్ద చిక్కే ఎదురయ్యింది.ప్రస్తుతం వినుకొండ, ఒంగోలు, నెల్లూరు కార్గో సర్వీస్ లలో పనిచేస్తున్న ఉద్యోగులందరూ కూడా ఆ బస్సు డ్రైవర్ కోసమే గాలింపు చర్యలు చేపట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube