మనలో చాలామందికి చదువు పూర్తయిన అనంతరం మల్టి నేషనల్ కంపెనీలలో( Multi National Companies ) మంచి ఉద్యోగం సొంతం చేసుకుని లైఫ్ ని ఎంజాయ్ చేయాలని కలలు కంటూ ఉంటారు.ఇక మరికొందరు అయితే, ఆ కంపెనీలలో ఎలాంటి సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుందా అని భయాలతో ఉంటారు.
అయితే, తాజాగా మల్టీ నేషనల్ కంపెనీలలో పని వాతావరణం ఎలా ఉంటుందో కొంతమంది కలలు కంటుంటారు.అచ్చం అలాగే తాజాగా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ దివ్యాన్షి( Divyanshi ) తన రోజు వారి పని ఎలా ఉంటుందో వివరిస్తూ ఒక వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.
ప్రముఖ టెక్ దిగ్గజమైన గూగుల్లో( Google ) పనిచేస్తున్న ఆ యువతి తన రోజువారి వర్క్ కల్చర్ గురించి వివరిస్తూ.ఒక వీడియోను షేర్ చేసింది.గూగుల్ సంస్థలో పనిచేయడం వల్ల అక్కడ లభించే ఏర్పాట్లు, అలాగే సవాళ్లు కూడా ఆమె అందులో తెలియజేసింది.వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా.గూగుల్ ఇంటర్నెట్ క్యాబ్ షెడ్యూలింగ్ సర్వీస్ G-Cab ద్వారా దివ్యాన్షి పని దినం ఉదయం 9 గంటలకు ప్రారంభమైతే.
బెంగళూరు ట్రాఫిక్ దాటుకొని బాగ్‌మని టెక్ పార్క్‌లోకి ఆమె గూగుల్ ఆఫీస్ లోకి చేరుకుంటుంది.అనంతరం ఆఫీస్ వద్ద అల్పాహారం తీసుకొని ప్రతి భవనంలోనూ అనేక కేఫ్ లు ఉండగా ఎంచుకోవడానికి వివిధ రకాల వంటకాలు కూడా అందుబాటులో ఉన్నట్లు కనిపిస్తుంది.హాట్ చాక్లెట్లతో సహా తనకు ఇష్టమైన భోజనంతో తన రోజున మొదలు పెట్టేసింది.
ఇక ఆఫీసులో పని మొదలైనప్పటికీ నెమ్మదిగా డిజైన్ ఆధారిత ఇంకా కోడింగ్ వర్క్ మధ్య మారుతూ కనిపించింది.అనంతరం కోడింగ్ సెషన్ల మధ్య గూగుల్ సూజనాత్మకంగా ఏర్పాటు చేసిన మీటింగ్ రూమ్ లోకి సమావేశాలకు గాను హాజరవ్వడం.
అలాగే సాయంత్రం పూట పని ముగించుకొని రద్దీగా ఉండే ట్రాఫిక్ ను తప్పించుకోవడానికి G-క్యాబ్‌ని షెడ్యూల్ చేసుకుంది.అలాగే వారి ఆఫీసులో ప్రతి బుధవారం కూడా ఒక ప్రత్యేక ట్రీట్ ఉంటుందని, కాగా ఈసారి బాల్ సింగ్ రాబిన్ అని తెలిపింది.