ఫిబ్రవరి నెల నుంచే ఎండలు ప్రారంభమయ్యాయి.ముఖ్యంగా ఏపీలో ఉష్ణోగ్రతలు భారీగా నమోదు అవుతున్నాయి.భానుడి ప్రతాపానికి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.బయట కాలు పెట్టడానికి కూడా భయపడుతున్నారు.ముఖ్యమైన పనులు ఉన్నవారు ఇక తప్పక ఎండల్లో తిరగాల్సిందే.అయితే ఎండ దెబ్బకు ఒక్కోసారి తల తిరిగిపోతుంటుంది.
విపరీతమైన నీరసం( Dizziness ) ఆవహిస్తుంటుంది.అయితే అలాంటి సమయంలో బాడీని రిపేర్ చేయడానికి, మైండ్ ను రిలాక్స్ చేయడానికి ఇప్పుడు చెప్పబోయే మసాలా లస్సీ( Masala Lassi ) అద్భుతంగా సహాయపడుతుంది.
అందుకోసం బ్లెండర్ తీసుకుని అందులో ఒక కప్పు ఫ్రెష్ పెరుగు( Curd ) వేసుకోవాలి.అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి,( Cumin Powder ) హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా, పాప టీ స్పూను బ్లాక్ సాల్ట్, చిటికెడు నార్మల్ సాల్ట్, ఐదారు ఫ్రెష్ పుదీనా ఆకులు, కొద్దిగా కొత్తిమీర వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో రెండు గ్లాసుల వాటర్, కొన్ని ఐస్ క్యూబ్స్ వేస్తే మన మసాలా లస్సీ అనేది రెడీ అవుతుంది.

వేసవికాలంలో( Summer ) ఈ లస్సీ ఆరోగ్యానికి అండగా నిలుస్తుంది.వేడి వాతావరణంలో శీతలీకరణ పానీయంగా ఉంటుంది.ఎండ దెబ్బకు తల తిరుగుతుంటే వెంటనే ఈ మసాలా లస్సీని తయారు చేసుకుని తీసుకోండి.
ఈ లస్సీ శరీరానికి తక్షణ శక్తిని( Instant Energy ) అందిస్తుంది.నీరసాన్ని తరిమి కొడుతుంది.తల తిరగడం, తలపోటు వంటి సమస్యల నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది.

ఈ మసాలా లస్సీ ప్రధానంగా పెరుగు నుండి తయారవుతుంది, ఇది ప్రోబయోటిక్స్ యొక్క గొప్ప మూలం.పెరుగులోని ప్రోబయోటిక్స్ ఆరోగ్యకరమైన గట్ మైక్రోబయోమ్‌ను నిర్వహించడానికి, మెరుగైన జీర్ణక్రియను ప్రోత్సహించడానికి సహాయపడుతుంది.అలాగే ఈ మసాలా లస్సీలో కాల్షయం మెండుగా ఉండటం వల్ల ఎముకలు, దంతాలు దృఢంగా మారతాయి.
అంతేకాకుండా ఈ లస్సీ బాడీని హైడ్రేట్ గా ఉంచుతుంది.వేడి వతావరణంలో డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుతుంది.
బరువు నిర్వహణలోనూ ఈ మసాలా లస్సీ తోడ్పడుతుంది.