సూపర్ స్టార్ కృష్ణ నటవారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు మహేష్ బాబు.తక్కువ కాలంలోనే చక్కటి నటనతో మంచి గుర్తింపు పొందాడు ఆయన.పలు సక్సెస్ ఫుల్ సినిమాలు చేసి తెలుగులో టాప్ హీరోగా కొనసాగుతున్నాడు.45 ఏండ్లు దాటినా 25 ఏండ్ల కుర్రాడిలా కనిపిస్తాడు ప్రిన్స్.ఇప్పటి వరకు ఆయన సుమారు 25 సినిమాలు చేశాడు.అందులో పలు ఇండస్ట్రీ హిట్ సినిమాలున్నాయి.ఇంతకీ తన కెరీర్ లో టాప్ 10 మూవీస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మహేష్ బాబు ని స్టార్ హీరోగా తయారు చేసిన సినిమా ఒక్కడు అని చెప్పుకోవచ్చు.
గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో తనతో పాటు భూమిక నటించింది.ప్రకాశ్ రాజ్ విలన్ పాత్ర చేశాడు.అటు ఫ్యామిలీ సినిమాలను ఇష్టపడే జనాలకు మురారి సినిమా బాగా నచ్చింది.అమాయకంగా, అల్లరిగా, ఎమోషనల్ గా ఈ సినిమా తీర్చి దిద్దాడు దర్శకుడు.
ఈ సినిమాలో మహేష్ నటన బాగా ఆకట్టుకుంది.అటు నిజం సినిమా కూడా ఆయనకు మంచిపేరు తీసుకొచ్చింది.
ఫలితం ఎలా ఉన్నా తనకు మాత్రం మంచి పేరు తెచ్చింది.ఈ సినిమాలో తన నటనకు గాను నంది అవార్డు దక్కింది.

మహేష్ బాబు జీవితంలో మర్చిపోలేని సినిమా పోకిరి.పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టింది.200 సెంటర్లలో 100 రోజులు ఆడి తెలుగు సినిమా పరిశ్రమ రికార్డులను బద్దలు కొట్టింది.ఆ తర్వాత బిజినెస్ మ్యాన్ సినిమా కూడా మహేష్ కెరీర్ లో కీ రోల్ ప్లే చేసింది.
ఈ సినిమాలో టేకింగ్, డైలాగులు అన్నీ అద్భుతంగా ఆకట్టుకున్నాయి.దూకుడు సినిమా ద్వారా తనకు ఎదురు లేదని నిరూపించుకున్నాడు మహేష్.

అటు ఖలేజా సినిమాలో నటించినా.మూవీ డిజాస్టర్ అయ్యింది.కానీ తన నటనకు మంచి మార్కులు పడ్డాయి.అటు శ్రీమంతుడు సినిమా మహేష్ కెరీర్ ను మరో మెట్టు ఎక్కించింది.వన్ నేనొక్కడినే సినిమా అర్థం కానట్లు ఉన్నా.తన నటనతో చంపేశాడు మహేష్.
అటు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్లు సినిమా ద్వారా మల్టీస్టారర్ సినిమా చేసి జనాలను విపరీతంగా ఆకట్టుకున్నాడు.