సాధారణంగా అయితే ఏ హీరో అయినా సరే ఇక మంచి విజయాన్ని సాధించాలి అనే సినిమా చేస్తూ ఉంటాడు.ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది అనుకుంటే ఏకంగా ఇండస్ట్రీ హిట్ అయిందంటే ఆ హీరోకే కాదు ఆ హీరో అభిమానులకి పండగ అని చెప్పాలి.
అయితే దాదాపు రెండు దశాబ్దాల కిందట సినిమా హిట్ అయిందా లేదా అన్న విషయాలను చెప్పేందుకు ఆ సినిమా ఎన్ని రోజులు ఆడింది అన్నది చూసేవారు.కానీ నేటి రోజుల్లో మాత్రం ఎన్ని కోట్ల కలెక్షన్స్ రాబట్టింది అన్నది ఎక్కువగా చూస్తూ ఉన్నారు.
అయితే గతంలో ఇండస్ట్రీ హిట్ అంటూ టాక్ వచ్చిన కొన్ని సినిమాల విషయంలో జరిగిన కాంట్రవర్సీ గురించి కూడా తెలుసుకుందాం.
ఖైదీ : మెగాస్టార్ చిరంజీవి కెరీర్ను మలుపు తిప్పింది ఖైదీ సినిమా.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో 1983లో వచ్చిన ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.ఇక అప్పట్లో ఖైదీ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచి ఎన్నో రికార్డులు తిరగరాసింది అని అంటారు.
కానీ నాగేశ్వరావు ప్రేమాభిషేకం, ఎన్టీఆర్ కొండవీటి సింహం సినిమాలను ఖైదీ క్రాస్ చేయాలని కొంతమంది వాదనలు వినిపించారు అప్పట్లో.
నిన్నే పెళ్ళాడుతా : నాగార్జున హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన నిన్నే పెళ్ళాడుతా సినిమా సూపర్ డూపర్ హిట్ అయితే షేర్ పరంగా మాత్రం ఈ సినిమా పెదరాయుడు సినిమా ను క్రాస్ చేయలేదని అంటూ ఉంటారు.
కలిసుందాం రా : వెంకటేష్ హీరోగా వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించాడు అయితే బాలయ్య నరసింహారెడ్డి సినిమా ను క్రాస్ చేయలేకపోయినట్లు టాక్ వుంది.కానీ వెంకీ మామ ఫ్యాన్స్ మాత్రం తమ హీరో ది బిగ్గెస్ట్ హిట్ అని అంటూ ఉంటారు.
ఖుషి : పవన్ కళ్యాణ్ కెరీర్ను పూర్తిగా తిరగేసిన సినిమా ఖుషి సెన్సేషనల్ హిట్ అయింది అన్న విషయం తెలిసిందే.అయితే షేర్ పరంగా మాత్రం నరసింహనాయుడు మూవీ క్రియేట్ చేసిన రికార్డుల దరిదాపుల్లోకి కూడా ఖుషి రాలేదని.అయితే ఇండస్ట్రీ హిట్ ఎలా అవుతుందని అప్పట్లో బాలయ్య ఫ్యాన్స్ వాదన వినిపించారు.
సింహాద్రి : రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన సింహాద్రి సినిమా ఎన్టీఆర్ కెరియర్ను కీలక మలుపు తిప్పింది.ఇక ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అంటూ అనుకునేవారు ఎన్టీఆర్ అభిమానులు.అయితే ఎక్కువ రోజులు ఆడిన సినిమా గా చిరంజీవి ఇంద్ర సినిమా రికార్డులు బ్రేక్ చేసిన ఈ సినిమా షేర్ పరంగా మాత్రం ఇంద్ర సినిమాను బ్రేక్ చేయలేదని అప్పట్లో డిబేట్ నడిచింది.
దూకుడు : మహేష్ బాబు హీరోగా వచ్చిన దూకుడు సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది.ఇండస్ట్రీ హిట్ అని అందరూ అనుకున్నారు.
కానీ చరణ్ మగధీర ను క్రాస్ చేయకుండా ఎలా ఇండస్ట్రీ హిట్ అవుతుందని మెగా ఫ్యాన్స్ కూడా వాదన వినిపించారూ అని చెప్పాలి.