ఈ మధ్యకాలంలో చాలామంది డైట్ లో బ్రోకలీ( Broccoli ) ఉండేలా చూసుకుంటున్నారు.అయితే మరి కొంతమందికి బ్రోకోలం అంటే కూడా బ్రోకలీ అంటే కూడా అసలు తెలియదు.
అయితే బ్రోకలీ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఎవరికీ కూడా తెలిసి ఉండదు.అందుకే రోజు వారి ఆహారంలో బ్రోకలిని చేర్చుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని, జీవన నాణ్యత కూడా మెరుగుపడుతుందని ఓ కొత్త అధ్యాయనం పేర్కొంది.
అంతేకాకుండా ఇది రొమ్ము క్యాన్సర్ కణాల పెరుగుదలను కూడా ఇది తగ్గిస్తుంది అని అధ్యయనం వెల్లడించింది.

బ్రోకలీ, క్యాలీఫ్లవర్, క్యాబేజీ( cauliflower, cabbage ) లేదా కాలే వంటి క్రూసిఫెరస్ కూరగాయలను ఎక్కువగా ఆహారంగా తీసుకుంటే మహిళలకు రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉందని గతంలో జరిగిన అనేక అధ్యయనాలు పేర్కొన్నాయి.అలాంటి ఆహారంలో అత్యధిక స్థాయిలో కనిపించే సల్ఫోరాఫేన్ క్యాన్సర్ కణాలు వివిధ విధానాల వల్ల రొమ్ము క్యాన్సర్( Breast cancer ) ప్రమాదాన్ని మాడ్యూలేట్ చేయగలరని కూడా పరిశోధనలో తేలింది.ఇక మరి ముఖ్యంగా సల్ఫోరాఫేన్ హిస్టోన్ డీసిటైలేస్‌లను( Sulforaphane histone deacetylases ) నిరోధిస్తుంది.
అంతేకాకుండా బరువు తగ్గించడానికి కూడా బ్రోకలీ అద్భుతమైన ప్రయోజనంగా పనిచేస్తుంది.బ్రోకలీలో మంచి పోషకాలు ఉన్నాయి బ్రోకలీలో విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి.

అలాగే విటమిన్ సి, కె, ఏ, ఫోలేట్, పొటాషియం, ఫైబర్ కూడా బ్రోకలీలో ఎక్కువగా ఉన్నాయి.ఈ పోషకాలు ఆరోగ్యకరమైన రోగ నిరోధక వ్యవస్థకు, అలాగే ఎముకలు బలపడటానికి, చర్మానికి, జీర్ణ క్రియను నియంత్రించడానికి కూడా సహాయపడతాయి.బ్రోకలీ యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉన్నాయి.ఇందులో ఫ్లేవనాయిడ్స్ సల్ఫోరాఫేన్ అనే సమ్మేళనాలు కూడా ఉన్నాయి.ఇవి శక్తివంతమైన ఆంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి.అందుకే క్యాన్సర్, గుండె జబ్బుల లాంటి ప్రమాదకరమైన వ్యాధులకు కూడా దారి తీసే ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి ఇది రక్షించడంలో సహాయపడతాయి.







