ఒక హీరో చేయాల్సిన సినిమా మరో హీరో చేశాడు.సూపర్ హిట్ అందుకున్నాడు.
ఇక ఈ మాట ఇండస్ట్రీలో తరచూ వినిపిస్తూనే ఉంటుంది అన్న విషయం తెలిసిందే.ఎందుకంటే దర్శక నిర్మాతలు ఒక హీరో ని దృష్టిలో పెట్టుకుని కథ రాస్తూ ఉంటారు.
కానీ ఆ తర్వాత ఆ హీరో డేట్స్ ఖాళీ లేక లేదా దర్శకుడు చెప్పిన కథ హీరోకి నచ్చక ఇక మరో హీరోతో సినిమా తీయాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి.పవన్ కళ్యాణ్ కెరీర్ లో సూపర్ హిట్ సినిమాగా నిలిచినా బద్రి విషయంలో కూడా ఇలాగే జరిగిందట.సాదాసీదాగా సాగిపోతోన్న పవన్ కళ్యాణ్ కెరీర్ ను ఒక్కసారిగా బూస్ట్ ఇచ్చిన సినిమా బద్రి.2000 సంవత్సరం లో రిలీజ్ అయిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది.
ఇక యూత్ అందరూ పవన్ కి ఒక రేంజ్ లో క్రేజ్ తెచ్చిపెట్టింది అని చెప్పాలి.మరీ ముఖ్యంగా బద్రి బద్రీనాథ్ అంటూ పవన్ తన మేనరిజంతో చెప్పే డైలాగ్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిపోయింది.
45 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకుంది ఈ సినిమా.ఈ సినిమాలో రేణు దేశాయ్ హీరోయిన్ గా నటించింది.మరో హీరోయిన్ అమీషా పటేల్ నటించింది.పవన్ కు సూపర్ హిట్ ఇచ్చిన ఈ సినిమాను అసలు పవన్ తో తీయాలని అనుకోలేదట దర్శకుడు పూరి జగన్నాథ్.
తెలుగు చిత్ర పరిశ్రమలో నాగేశ్వరరావు వారసుడు ఎంట్రీ ఇచ్చి మన్మధుడి గా పేరు సంపాదించుకున్న నాగార్జునతో బద్రి సినిమా తీయాలని అనుకున్నాడట పూరి జగన్నాథ్.నాగార్జున ఇమేజ్ కు ఈ కథ బాగా సూట్ అవుతుందని భావించాడట.ఇలా ముందుగా అనుకున్న కథ మారి ఆ తర్వాత హీరో కూడా మారి పవన్ వరకు ఈ సినిమా స్టోరీ వెళ్లిందని ఇండస్ట్రీలో ఒక టాక్ ఉంది.ఇక పవన్ ఖాతాలో హిట్ పడటంతో పాటు బద్రి సినిమా ద్వారా అటు పూరి జగన్నాథ్ ఫస్ట్ సినిమా సూపర్ హిట్ కావడంతో ఒక్కసారిగా స్టార్ దర్శకుడిగా మారిపోయాడు పూరి జగన్నాథ్.
ఇక ఈ కథను పవన్ కళ్యాణ్ కు చెప్పేందుకు చోట కె నాయుడు ద్వారా పవన్ కళ్యాణ్ ని అప్రోచ్ అయ్యాడట పూరి జగన్నాథ్.అలా బద్రి సినిమా సెట్ అయింది.