ఏ నటుడు అయినా కూడా స్టార్ నటుడు కావడానికి మంచి సినిమాలు చేయాలి.అవి బాగా ఆడితే మంచి పేరు రావడం తో పాటు మరిన్ని మంచి సినిమాలు చేయడానికి దోహదం చేస్తాయి.
అంతే కాదు అవి ఆ నటుడిని స్టార్ ని చేసే అవకాశం కూడా ఉంది.ఆలా కన్నడ లో స్టార్ హీరో గా కొనసాగవుతున్న సుదీప్ విషయం లో కూడా కొన్ని సంఘటనలు జరిగి అందుకే తగ్గట్టుగా అతడి కృషి కూడా తోడవడం తో ప్రస్తుతం స్టార్ హీరో గా కొనసాగుతున్నాడు.
ఇక కొన్ని సార్లు తమ చేతిలోకి ఒక గొప్ప కథ రావడానికి ముందు వేరే స్టార్ హీరోల చేతిలోకి వెళ్లి రిజెక్ట్ అయ్యి ఉంటుంది.అలాంటి సందర్భాలు మాములుగా అన్ని సినిమాలకు జరుగుతూనే ఉంటాయి.
కానీ అవి గొప్ప సినిమాలు అయినప్పుడే అసలు బాధ.చేసి ఉంటె బాగుండేదని రిజెక్ట్ చేసిన హీరోలు అనుకుంటూ ఉంటారు.అలాంటి ఒక సినిమా సేతు.తమిళ్ లో విక్రమ్ తీసిన ఈ చిత్రం చాలా పెద్ద హిట్టయ్యింది.ఇదే సినిమాను తెలుగు లో సేతు పేరు తో రాజశేఖర్ తీయగా, కన్నడ లో హుచ్చ పేరు తో సుదీప్ కిచ్చ చేసాడు.ఇక కన్నడ లో ఈ సినిమా ఇద్దరు స్టార్ హీరోలు రిజెక్ట్ చేయగా సుదీప్ చేతులోకి చేరింది.
మొదటగా కన్నడ లో రైట్స్ కొన్న రెహమాన్ మొదట రాజ్ కుమార్ కుమారుడు శివన్న తీయాలని అనుకున్నాడట.కుటుంబం అంత సినిమా చూసి కథ బాగుందని, కాకపోతే ఏమైనా చేంజెస్ చేస్తే కథ చెడిపోతుంది భావించారట.
అలా కథను అదే విధంగా తీస్తే విలన్ గా చేసే వ్యక్తిని శివన్న అభిమానులు చంపేస్తారేమో అని భయపడి ఆ సినిమా నుంచి తప్పుకున్నారట.ఇక ఆ తర్వాత ఈ కథ ఉపేంద్ర దగ్గరికి వెళ్లిందట.అప్పటికే తమిళనాట వస్తున్న మౌత్ టాక్ ఉపేంద్ర వరకు చేరి ఉండటం తో ఆ సినిమా చేయడానికి ఒప్పుకున్నారు కానీ సినిమా పేరు హుచ్చ కాకుండా మరొక పేరు పెట్టమన్నారట.ఎందుకంటే హుచ్చ అంటే పిచ్చివాడు అని అర్ధం.
అప్పటికే ఉపేంద్ర తీసే భిన్నమైన సినిమాల వల్ల అతడికి పిచ్చి వాడు అనే పేరు వచ్చి ఉంది.అందుకే టైటిల్ మారిస్తే చేస్తా అనడం తో రెహమాన్ ఒప్పుకోక సుదీప్ కి ఇచ్చి చేయించి అతడిని పెద్ద స్టార్ హీరో చేసాడు.